Viral Video: మేక కోసం ప్రాణాలకు తెగించి బోరు బావిలోకి దూరాడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Viral Video: సాటి మనుషులే ప్రాణాపాయ స్థితిలో ఉంటే పట్టించుకోని ప్రస్తుత కాలంలో.. ఓ మేక పిల్లను ప్రాణాలుకు తెగించి కాపాడాడు..

Viral Video: మేక కోసం ప్రాణాలకు తెగించి బోరు బావిలోకి దూరాడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Updated on: Jan 21, 2022 | 2:45 PM

Viral Video: సాటి మనుషులే ప్రాణాపాయ స్థితిలో ఉంటే పట్టించుకోని ప్రస్తుత కాలంలో.. ఓ మేక పిల్లను ప్రాణాలుకు తెగించి కాపాడాడు ఓ వ్యక్తి. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మేక పిల్లను కాపాడేందుకు వ్యక్తి.. తన ప్రాణాలను పణంగా పెట్టి ఇతర స్నేహితుల సాయంతో బోరు బావిలోకి దూరాడు. మొత్తానికి మేక ప్రాణాలను సురక్షితంగా కాపాడాడు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. వ్యవసాయ క్షేత్రంలో నిరుపయోగంగా ఉన్న బోరు బావి ఉంది. మేత మేస్తూ ఓ మేక పిల్ల అందులో పడిపోయింది. ఇది గమనించిన స్థానికులు.. దానికి కాపాడేందుకు ప్రయత్నించాడు. అయితే, మేకపల్లి ఆ గోయ్యి లోపలికి జారుకోవడంతో కష్టంగా మారింది. దీంతో అక్కడ ఉన్న వ్యక్తి ఆ గొయ్యిలోకి దూరి మేక పిల్లను బయటకు తీసేందుకు సిద్ధమయ్యాడు. మిగతా స్నేహితులు అతని కాళ్లు పట్టుకోగా.. అతను బోరుబావిలోకి దూరాడు. లోపల ఇరుక్కుపోయిన మేక పిల్ల చేతికి అందగానే.. పైన ఉన్న స్నేహితులు అతన్ని పైకి లాగారు. కాగా, దీనంతటినీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్ అవుతోంది.

మేక కోసం ప్రాణాలకు తెగించి లోతైన గొయ్యిలోకి ప్రవేశించడం పట్ల నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. వీడియో చూస్తే గూస్‌బంప్స్ వస్తున్నాయని నెటిజన్లు పేర్కొంటున్నారు. వారి మానవత్వానికి సెల్యూట్ కొడుతున్నారు. ఇది జంతువుల పట్ల నిజమైన ప్రేమ అని కొనియాడుతున్నారు.

Viral Video:

Also read:

Hansika Motwani: హంసలా మెరిసిపోతున్న హన్సిక మోత్వానీ లేటెస్ట్ ఫోటోస్

PM Narendra Modi: నెంబర్‌వన్ లీడర్ ప్రధాని మోదీనే.. ప్రపంచ స్థాయిలో ఇంకా పెరుగుతున్న చరిష్మా..

Faria Abdullah: తన ఒంపుసొంపులతో ఫ్యాన్స్ మనసులు దోచుకుంటున్న ఫారియా అబ్దుల్లా లేటెస్ట్ ఫోటోస్