ఈ రోజుల్లో మనకు తినడానికి లెక్కలేనన్ని పదార్థాలు ఉన్నాయి. ఇక ఆహార పదార్థాలను కొంత వరకు కొత్త వెరైటీలు ట్రై చేయాలి.. అది చూసేందుకు, తినడానికి కూడా ప్రజలు ఇష్టపడతారు.. కానీ, కొందరు మాత్రం ఇలాంటి వెరైటీ వంటకాల పేరుతో విపరీతాలు ట్రై చేస్తూ.. ఆహారాన్ని వృధా చేస్తున్నారు. అలాంటి వీడియోలు గతంలో కూడా మీరు అనేకం చూసే ఉంటారు.. కొందరు చేపలతో టీ తాగుతుండటం, ఒకరు బిస్కెట్లతో స్వీట్లు తింటుండటం కూడా చూశాం..ఇలాంటి విచిత్ర పనులు చేసే వారి వీడియోలను చూసిన తర్వాత ప్రజలు కోపంతో సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. అలాంటి వీడియో ఒకటి మళ్లీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన తర్వాత మీరు మీ సహానాన్ని పరిక్షించుకుంటారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక వ్యక్తి తయారు చేసిన వంటకం నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలకు దారి తీసింది. అతడు భిన్నమైన పదార్థాలను కలిపి ఐస్ క్రీం తయారు చేస్తున్నాడు. ఇది ఊహకు కూడా అందని వింత వంటకం. ఎందుకంటే.. ఇప్పటి వరకు మీరు వెనిలా ఐస్ క్రీం, చాక్లెట్‌తో సహా వివిధ రుచుల ఐస్‌క్రీమ్‌లను తిని ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా మ్యాగీ ఐస్ క్రీం తిన్నారా..? అవును మీరు విన్నది నిజమే.. ఒక వైరల్ వీడియోలో ఒక వ్యక్తి మ్యాగీ ఐస్ క్రీం ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాడు. వీడియో వైరల్ కావడంతో ప్రజలు తమ కోపాన్ని నియంత్రించుకోలేక కామెంట్లతో అతనిని కడిగి పారేస్తున్నారు.
ఈ వీడియో Instagramలో foodb_unk అనే ఖాతాతో షేర్ చేయబడింది. ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. ఈ వీడియో చూసిన వారంతా ఆగ్రహంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక వినియోగదారు స్పందిస్తూ.. మీరు చేసిన పనికి.. గరుడ పురాణంలో మీకు భిన్నమైన శిక్ష ఉంటుందన్నారు. మరోకరు వ్యాఖ్యనిస్తూ..పాపం.. మ్యాగీ తనకు ఏం జరుగుతుందోనని భయపడి ఉంటుందని ఫన్నీగా కామెంట్ చేశారు. మొత్తానికి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ స్పందించారు. ఏదో ఒక కామెంట్‌తో విరుచుకుపడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..