
మధ్యతరగతి వారికి నిత్యం ఆర్ధిక కష్టాలే. ఒక సమస్య తీరేసరికి ఇంకో సమస్య ఎదురవుతుంటుంది. అలాంటి సమయంలో వారికి లాటరీ తగలడమో.. లేదంటే నిధిలాంటిది ఏమైనా దొరికింది అంటే వారి ఆనందానికి అవధులుండవు. అలాంటివారిని అందరూ అదృష్టవంతులు అంటూ ఉంటారు. అలా ఓ వ్యక్తికి ఇంటి ఆవరణలో తవ్వుతుండగా అతనికి బంగారు నిధి దొరికింది. దాంతో అతని ఆనందంతో పొంగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అతను తన ఇంటి ఆవరణలో తవ్వుతుండగా ఓ మట్టి కుండ ఒకటి కనబడింది. ఏదో పగిలిపోయిన పాతకుండ పెంకు అయి ఉంటుందిలే అనుకున్నాడు. కానీ అలా తవ్వుతుండగా పూర్తిగా కుండ బయటపడింది. అది పగలగొట్టి చూడగానే దాని లోపల బంగారు ఆభరణాలు, నాణేలు కనిపించాయి. దీంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇవి పాత కాలం నాటి నిజమైన నాణేలు అని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను పదిలక్షలమందికి పైగా వీక్షించారు. దాదాపు లక్షమందికి పైగా లైక్ చేశారు. అతని అదృష్టం అంతే అతనిదే అంటూ కామెంట్లు చేస్తున్నారు.