Video: ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఐస్‌క్రీమ్ అందుకోబోయాడు.. క్షణాల్లోనే ఎవ్వరూ ఊహించని సీన్.. వీడియో చూడండి..

ఒక్క ఐస్‌క్రీమ్ కోసం కిందకు వెళ్లడానికి బద్ధకించాడు.. పైనుంచే చేతులు చాచాడు.. కట్ చేస్తే, ఊహించని ప్రమాదంలో పడ్డాడు.. మనం చేసే చిన్న బద్ధకం.. ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుందని చెప్పడానికి ఈ వీడియోనే ఒక నిదర్శనం. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. వీడియో మీరూ చూడండి..

Video: ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఐస్‌క్రీమ్ అందుకోబోయాడు.. క్షణాల్లోనే ఎవ్వరూ ఊహించని సీన్.. వీడియో చూడండి..
Man Falls From Balcony For Ice Cream

Updated on: Jun 25, 2026 | 3:47 PM

సోషల్ మీడియాలో రోజుకు ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని నవ్విస్తే.. మరికొన్ని మాత్రం ఒక్కసారిగా గుండె ఆగినంత పని చేస్తాయి. అలాంటి ఒక షాకింగ్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. కేవలం ఒక ఐస్‌క్రీమ్ కొనేందుకు ప్రయత్నిస్తూ.. ఒక వ్యక్తి చేసిన చిన్న పొరపాటు ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రకు చెందిన ఒక వ్యక్తి తన ఇంటి మొదటి అంతస్తు బాల్కనీలో నిలబడి ఉన్నాడు. అదే సమయంలో కింద వీధిలో ఐస్‌క్రీమ్ బండి వెళ్తుండటం చూసి అతడిని ఆపాడు. అయితే కిందకు వచ్చి ఐస్‌క్రీమ్ తీసుకోవడానికి బద్ధకించిన ఆ వ్యక్తి.. బాల్కనీ పైనుంచే చేతులు చాచి ఐస్‌క్రీమ్ ఇవ్వమని అడిగాడు. దీంతోకింద ఉన్న ఐస్‌క్రీమ్ వ్యాపారి కూడా తన చేతిని పైకి చాచి, అతనికి ఐస్‌క్రీమ్ అందించేందుకు ప్రయత్నించాడు.

ఇక్కడివరకు అంతా బాగానే ఉంది. అయితే బాల్కనీలో ఉన్న వ్యక్తి ఐస్‌క్రీమ్‌ను అందుకోవడానికి కాస్త ముందుకు వంగాడు. అంతే.. ఒక్క క్షణంలో బ్యాలెన్స్ తప్పి, నేరుగా పైనుంచి కింద పడిపోయాడు. కింద ఉన్న వ్యాపారి, చుట్టుపక్కల వారు చూస్తుండగానే ఈ ఘోరం జరిగిపోయింది. ఈ షాకింగ్ దృశ్యాలన్నీ అక్కడి కెమెరాలో రికార్డయ్యాయి. ఆశిష్ పాశ్వాన్‌తో పాటు పలువురు షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. అయితే కింద పడిపోయిన ఆ వ్యక్తికి ఎలాంటి గాయాలయ్యాయి? ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉందనే దానిపై ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు. చిన్న అలసత్వం, బద్ధకం ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చిన్న పొరపాటు.. ప్రాణాలకే ముప్పు

నిత్య జీవితంలో మనం చేసే ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుంటాయి. ఎత్తులో ఉండే బాల్కనీల గోడలపైకి వంగడం, కింద ఉన్న వస్తువులను అందుకోవడానికి ప్రయత్నించడం అస్సలు సురక్షితం కాదు. కాస్త ఓపిక తెచ్చుకుని కిందకు వెళ్లడం లేదా తాడు సహాయంతో బ్యాగ్ లాంటిది ఉపయోగించడం సురక్షితం. ఇలాంటి నిర్లక్ష్యపు పనులు చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించాలంటూ ఈ వీడియో చూసిన నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వీడియో చూడండి..

Follow Us