Viral Video: వాట్ ఎన్ ఐడియా సర్జీ.. ఆటోను కారుగా మార్చుకున్న యువకుడు.. వీడియో వైరల్

ఈ టెక్నాలజీ ద్వారా రకరకాల వస్తువులు తయారు చేసే జూగాడ్ వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అందులోనూ మన దేశంలో జుగాడ్ ల గురించి ఎంత చెప్పినా తక్కువే.. వీటిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతూ ఉంటారు. మరికొన్ని ప్రముఖులను కూడా ఆకట్టుకుంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశమైంది. అక్కడ ఒక వ్యక్తి తన ఆటోను కారుగా మార్చాడు.

Viral Video: వాట్ ఎన్ ఐడియా సర్జీ.. ఆటోను కారుగా మార్చుకున్న యువకుడు.. వీడియో వైరల్
Viral Video
Image Credit source: Instagram

Updated on: Nov 25, 2024 | 1:21 PM

జూగాడ్ విషయంలో భారతీయులమైన మనకు పోటీ లేదు. మనవాళ్ళు చాలా సార్లు జూగాడ్ ద్వారా ఎన్నో రకాల వస్తువులను తయారు చేసి సంచలనం సృష్టించారు కూడా.. వాటిని చూసిన తరువాత, ప్రజలు ఆశ్చర్యపోతారు. పూర్తిగా ఆలోచనలో పడతారు. అయితే ఎక్కువగా జూగాడ్ లు తయారు చేసేది వాహనాల విషయంలోనే అనిపిస్తుంది. ప్రస్తుతం ఒక దేశీ జూగాడ్ వీడియో ఒకటి నెట్టింట్లో చర్చనీయాంశమైంది. ఒక వ్యక్తి తన ఆటోను కారుగా మార్చాడు.

తన వాహహనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు.. ప్రతి ఒక్కరూ తన వైపు తిరిగి చూసే విధంగా కొని రకాల వాహనాలను తయారు చేసిన వీడియోలు చూసే ఉంటారు. ఈ రోజుల్లో ఇలాంటిదే ఒకటి కనిపించింది. ఒక వ్యక్తి తన త్రీ-వీలర్ ఆటోను సరిగ్గా కారు లాగా చేశాడు. దీనిని చూసి ప్రజలు తమ కళ్ల తామే నమ్మలేకపోతున్నారు. దీంతో అతని ప్రత్యేకమైన కారును కొందరు ప్రశంసిస్తుంటే.. అతని ప్రతిభను కీర్తిస్తూ.. ఇది బాగుందని.. తాము ఇది నిజం అని నమ్మలేకపోతున్నట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

ఓ వ్యక్తి తన ఆటోని విలాసవంతమైన కారుగా మార్చడాన్ని వీడియోలో చూడవచ్చు. లుక్‌లో కారులాగా.. వెనుక నుంచి ఆటో రిక్షాలా కనిపిస్తోంది. కారును అందంగా తీర్చిదిద్దేందుకు జీబ్రా లాగా నలుపు, తెలుపు రంగులు వేశారు. ఇందులో రెండు సీట్లు అమర్చబడి ఉండటం కనిపిస్తుంది. స్టీరింగ్ కూడా ఉంది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆటో రిక్షాలా కాకుండా,.. ఈ వాహనం ముందు రెండు చక్రాలు.. వెనుక ఒక చక్రంతో ఉంది.

ఈ వీడియో ఇన్‌స్టాలో రాహుల్‌కట్‌షెవ్38 అనే ఖాతాలో షేర్ చేశారు. ఇది చూసిన ప్రజలు దీనిపై ఘాటుగా వ్యాఖ్యానిస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒకరు ‘సోదరా, ఇది పూర్తిగా భిన్నమైన స్థాయి జుగాద్.’ ‘ఇది అందంగా కనిపించవచ్చు, అయితే ఈ జుగాడ్ ప్రమాదకరమైనది’ అని కామెంట్ చేశాడు. ఈ కారు మిస్టర్ బీన్ కారు అని మరో వినియోగదారు రాశారు. అంతేకాదు చాలా మంది ఇతర వినియోగదారులు దీనిపై వ్యాఖ్యానిస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us