హైదరాబాద్(Hyderabad)లో విషాద సంఘటన చోటు చేసుకుంది. పాముకాటుకు గురైన ఓ స్నేక్ క్యాచర్(Snake Catcher) ప్రాణాపాయస్థితిలో పడ్డాడు. పామునుపట్టి తర్వాత హీరోలా ఫొటోలకు ఫోజులివ్వడమేకాకుండా, దానికి లిప్‌టూ లిప్ ముద్దులిస్తూ ఫోజులిచ్చాడు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరాడు.
Also Read: Viral Photo: ఈ ఫోటోలో పాము దాగుంది.. కనిపెడితే మీరు గ్రేటే! అంత ఈజీ కాదండోయ్.!
మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఆకాష్ నగరానికి వలస వచ్చాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గాజుల రామారం డివిజన్ కట్ట మైనమ్మబస్తీలో నివాసం ఉంటున్నాడు. రాళ్లు కొడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కాగా పాములను పట్టుకోవడంతో దిట్ట అయిన ఆకాష్ ఆదివారం రాత్రి జనవాసాల్లోకి వచ్చిన విషసర్పాన్ని పట్టుకుని మెడలో వేసుకుని ముద్దుపెడుతూ సెల్ఫీలు దిగాడు..ఆ తరువాత సర్పాన్ని వదిలిపెట్టాడు. ఆ తర్వాత అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు.. పాము కాటు వేయడంతోనే అస్వస్థతకు గురైనట్లు, ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Also Read:
Dragon Fruit: ఈ 3 వ్యాధులను దూరం చేసే దివ్య ఔషధం.. తింటే తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సర్వం సిద్దం! రెండ్రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం!!
మాతోనే గేమ్సా.! కుక్కను మింగేయాలనుకున్న కొండచిలువకు చుక్కలు చూపించారు.. వైరల్ వీడియో!
ఈ ఉంగరాల జుట్టు చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? సొగసులతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది.!