Viral Video: కొడుకు కోసం అందమైన ప్లేహౌస్‌ నిర్మించిన తండ్రి.. మురిసిపోయిన చిన్నారి.. బ్యూటిఫుల్‌ వీడియో

Father Builds A Wooden Playhouse For Son: బిడ్డల కోసం తల్లిదండ్రులు ఏమైనా చేస్తారు. వారు ఆనందంగా ఉండేందుకు.. అనుక్షణం ఏదైనా చేయడానికి వెనుకాడరు.

Viral Video: కొడుకు కోసం అందమైన ప్లేహౌస్‌ నిర్మించిన తండ్రి.. మురిసిపోయిన చిన్నారి.. బ్యూటిఫుల్‌ వీడియో
Child Video

Updated on: Sep 24, 2022 | 6:45 AM

Father Builds A Wooden Playhouse For Son: బిడ్డల కోసం తల్లిదండ్రులు ఏమైనా చేస్తారు. వారు ఆనందంగా ఉండేందుకు.. అనుక్షణం ఏదైనా చేయడానికి వెనుకాడరు. తాజాగా.. ఓ తండ్రి బిడ్డ కోసం చేసిన పని నెట్టింట అందర్ని తెగ ఆకట్టుకుంటోంది. దీన్ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. బిడ్డ మీద ప్రేమతో ఓ తండ్రి తన కొడుకు కోసం అందమైన ప్లేహౌస్‌ను నిర్మించాడు. దీనికి చిన్న ఎలివేటర్‌ కూడా ఏర్పాటు చేశాడు. అయితే.. తన న్యూ గిఫ్ట్‌ను చూసి మురిసిపోయిన చిన్నారి.. బోసి నవ్వులు నవ్వుతూ తెగ మురిసిపోయాడు. ఈ రియాక్షన్‌ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

వైరల్ వీడియోలో చిన్నారి తొలిసారిగా ప్లేహౌస్‌లోకి అడుగుపెట్టడం చూడవచ్చు. ఎలివేటర్‌లో ఇంటిపైకి వెళుతూ ఆనందంతో మురిసిపోతాడు. ఎలివేటర్‌లోకి ప్రవేశించగానే.. ఓ చైన్‌ అడ్డుపెట్టి తండ్రి ఎలివేటర్‌కి కట్టిన తాడును లాగుతాడు. అనంతరం పిల్లవాడు చెక్క ఎలివేటర్‌పై నిలబడి నవ్వుతూ.. ప్లే హౌస్‌కి చేరుకుంటాడు. అనంతరం అక్కడి నుంచి చూస్తూ ఆనందంతో నవ్వుతాడు. ఆ తర్వాత ఎలివేటర్‌ నుంచి కిందకు వస్తాడు. అయితే.. చిన్నారికి తగినట్లుగా తండ్రి.. ప్లేహౌస్‌తో పాటు, మాన్యువల్ ఎలివేటర్‌ను నిర్మించాడు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

ఈ వైరల్‌ వీడియోను గురువారం ట్విట్టర్‌లో డానీ డెరానీ అనే వినియోగదారుడు షేర్‌ చేశాడు. అప్పటినుంచి ఈ వీడియోకు 9 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. అంతేకాకుండా లక్షలాది మంది లైక్‌ చేసి.. కామెంట్లు చేస్తున్నారు. పిల్లల ఆనందమే అందరికీ కావాలని.. కానీ ఎలివేటర్‌తో డేంజర్‌ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us