షాపు ఓనర్‌కు బడిత పూజ చేసిన యువతి.. ఎందుకో తెలిసి అంతా షాక్!

వేధింపులతో విసిగిపోయిన ఓ మహిళ తన దుకాణ యజమానికి బడిత పూజ చేసింది. ఆ మహిళ అతని దుకాణంలోనే దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. థానేలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

షాపు ఓనర్‌కు బడిత పూజ చేసిన యువతి.. ఎందుకో తెలిసి అంతా షాక్!
Woman Beats Shop Owner

Updated on: Sep 13, 2025 | 6:58 PM

వేధింపులతో విసిగిపోయిన ఓ మహిళ తన దుకాణ యజమానికి బడిత పూజ చేసింది. ఆ మహిళ అతని దుకాణంలోనే దాడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. థానేలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్రలోని కళ్యాణ్‌లోని కోల్షేవడీ ప్రాంతంలో జరిగిన ఓ ఘటన వైరల్‌గా మారింది. ఓ దుకాణంలో పనిచేస్తున్న యువతి ఆ షాప్‌ యజమాని 55 ఏళ్ల వ్యక్తిని చెప్పుతో కొట్టింది. తన మొబైల్ ఫోన్‌లో అసభ్యకరమైన సందేశాలు పంపి తనను వేధించాడని ఆ మహిళ ఆరోపించింది.

తనను వేధిస్తున్నాడంటూ యువతి కుటుంబానికి చెప్పడంతో వాళ్లు వెంటనే షాప్‌కి వచ్చారు. ఆ మహిళ తన తల్లితో కలిసి గురువారం (సెప్టెంబర్ 11) మధ్యాహ్నం దుకాణానికి చేరుకుని వేధింపుల గురించి నిలదీసింది. అందుకు ఆమె క్షమాపణ కూడా కోరింది. అయితే కుటుంబం ముందే యువతి యజమానికి చెప్పుతో బడిత పూజ చేసింది. చివరకి యువతి కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పేవరకు వదల్లేదు బంధవులు.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా ఇందుకు సంబంధించి ఫిర్యాదు  అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

మహారాష్ట్రలోని కళ్యాణ్‌లోని కోల్షేవడీ ప్రాంతంలో జరిగిన ఓ ఘటన వైరల్‌గా మారింది. ఓ దుకాణంలో పనిచేస్తున్న యువతి ఆ షాప్‌ యజమానిని చెప్పుతో కొట్టింది. తనను వేధిస్తున్నాడంటూ యువతి కుటుంబానికి చెప్పడంతో వాళ్లు వెంటనే షాప్‌కి వచ్చారు. అయితే కుటుంబం ముందే యువతి యజమానికి చెప్పుతో బడిత పూజ చేసింది. చివరకి యువతి కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పేవరకు వదల్లేదు బంధవులు.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది

వీడియో చూడండి.. 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..