Viral Video: ఈ సీన్ చూశారా మాస్టారూ..! సింహం టాయిలెట్ యూజ్ చేస్తోంది

|

Oct 04, 2021 | 8:20 PM

జంగిల్ అంటే రకరకాలు జంతువులు, పక్షలకు ఆవాసం. అయితే వాటన్నింటినీ రూల్ చేసేది మాత్రం సింహం. తాజాగా ఓ సింహం వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Viral Video: ఈ సీన్ చూశారా మాస్టారూ..! సింహం టాయిలెట్ యూజ్ చేస్తోంది
Lion Using Toilet
Follow us on

జంగిల్ అంటే రకరకాలు జంతువులు, పక్షలకు ఆవాసం. అయితే వాటన్నింటినీ రూల్ చేసేది మాత్రం సింహం. దాని గాండ్రిపు విన్నాయంటే మిగిలిన జంతువులు కిలోమీటరు దూరం పారిపోతాయి. దాని దర్పం, రాజసం నడకలోనే కనిపిస్తుంది. కాగా తాజాగా ఓ సింహం ప్రవర్తించిన తీరు హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ వీడియో చూస్తే అడవికే రాజు అయిన సింహం తన అలవాట్లు మార్చుకుందేమోననే డౌట్ రాకమానదు.   సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతోన్న ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

ఒక కదులుతున్న కారులో నుంచి ఈ వీడియోను షూట్ చేశారు. ఈ వీడియోలో కారు పబ్లిక్‌ టాయిలెట్‌ దగ్గర ఆగగానే లోపల్నుంచి ఓ సింహం ఇంపాదిగా బయటకు వచ్చింది. కార్ ఉన్నవాళ్లని చూసి కూడా అది లైట్ తీసుకుంది. తనకు మరేదో పని ఉన్నట్లు కూల్‌గా అడవిలోకి వెళ్లిపోతుంది. ఐతే ఈ వీడియో ఎక్కడ షూట్ చేశారన్న వివరాలు తెలియరాలేదు.  కానీ దీనిని చూసిన నెటిజన్లు మాత్రం భిన్న రకాలుగా స్పందింస్తున్నారు. ‘చదువుకున్న సింహం’ అని ఒకరు కామెంట్‌ చేస్తే, ‘చాలామంది మనుషులు దాన్ని చూసి నేర్చుకోవాలని’ మరొకరు వ్యాఖ్యానించారు.

Also Read:  ‘రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఫోన్‌లో దిశ యాప్‌’… సీఎం జగన్ కీలక ఆదేశాలు

ఈ వారం థియేటర్స్, ఓటీటీలలో రిలీజ్ అవ్వబోతున్న సినిమాలు ఇవే.. పూర్తి వివరాలు