
సాధారణంగా పోలీసులు, లాయర్లు ఫ్రెండ్లీగా ఉంటారు. అయితే అక్కడ మాత్రం ఓ పోలీసు అధికారిపై లాయర్లు మూకుమ్మడి దాడి చేశారు. పోలీస్ అఫీసర్‌తో పాటు ఆయన వెంట ఉన్న కానిస్టేబుల్‌ను కూడా కుమ్మేశారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిందీ ఘటన. దాడి చేస్తున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దాడికి బరగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భూ వివాదం కారణంగా తెలుస్తోంది.
ఎస్‌ఐ మిథిలేష్ ప్రజాపతి కానిస్టేబుల్ రాణా ప్రసాద్‌తో కలిసి వారణాసి కోర్టుకు విచారణ కోసం హాజరయ్యారు. అయితే గతంలో న్యాయవాదిపై దాడి చేసిన ఎస్‌ఐపై ప్రతీకారం కోసం లాయర్లంతా సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో కొందరు న్యాయవాదులు గుంపుగా వచ్చి పోలీస్ అధికారి మిథిలేష్ ప్రజాపతిపై దాడి చేశారు. పోలీసులు పారిపోతున్నా కూడా వెంటపడి మరీ కుమ్మేశారు. ఈ క్రమంలో ఎస్‌ఐ స్పృహ కోల్పోయారు. అయినా వదలకుండా ఈడ్చుకెళ్లి మరీ దాడి చేశారు.
అయితే కోర్టులోని మిగతా పోలీసులు జోక్యం చేసుకుని ఎస్‌ఐ మిథిలేష్ ప్రజాపతిని లాయర్ల నుంచి విడిపించారు. న్యాయవాదుల దాడిలో ఎస్‌ఐతో పాటు కానిస్టేబుల్ రాణా ప్రసాద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో లాయర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ అధికారిపై న్యాయవాదుల దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది.
Varanasi Court: Lawyers chased and brutally beat up police officers — a constable and inspector seriously injured, now in trauma care.
FIR filed against over 50 lawyers, including 10 named.#Varanasi #LawAndOrder #BreakingNews pic.twitter.com/jO5knpyzio— Shubham Yadav (@Shubhamsaying) September 17, 2025