
పెట్రోల్ ముడి చమురు నుంచి తయారు చేస్తారనేది అందరికి తెలిసిన విషయమే. ఈ ముడిచమురును సముద్రంలోని భూమి పొరల్లోంచి వెలికి తీస్తారు. అయితే దీన్ని నేరుగా ఉపయోగించడం అసాధ్యం. అందుకే రిఫైనరీలలో ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, కాటలిటిక్ క్రాకింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో శుద్ధి చేస్తారు. ఈ ప్రక్రియతో ముడి చమురు నుంచి పెట్రోల్, డీజిల్, కిరోసిన్‌ను తయారు చేస్తారు.
ఒక లీటర్ ముడి చమురు నుండి ఏమి వస్తుంది?
రిఫైనరీలో ముడి చమురును వేడి చేసినప్పుడు, వివిధ ఉష్ణోగ్రతల వద్ద వేర్వేరు ఉత్పత్తులు లభిస్తాయి. సగటున, ఒక లీటరు ముడి చమురు నుండి 0.4 నుండి 0.6 లీటర్ల(450 ML) పెట్రోల్ తయారు చేస్తారు. అలాగే 0.2 నుండి 0.3 (250 ML ) డీజిల్ ఉత్పత్తి చేస్తారు. అలాగే కిరోసిన్ కూడా తయారు చేస్తారు. ఇక మిగిలిన భాగం వృధా కాదు. దీని నుండి ప్లాస్టిక్, మందులు, రోడ్లు వేయడానికి ఉపయోగించే తారు వంటివి తయారు చేస్తారు.
ముడి చమురును ఎలా శుద్ధి చేస్తారు?
అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, ఈ ప్రక్రియ ఒక పెద్ద టవర్ వంటి యంత్రంలో జరుగుతుంది. ముడి చమురును 400°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి ఆవిరిగా మారుస్తారు. ఈ ఆవిరి టవర్‌లో పైకి వెళ్లే కొద్దీ చల్లబడుతుంది. తక్కువ ఉష్ణోగ్రత వద్ద చల్లబడే తేలికపాటి కణాలు పెట్రోల్‌గా మారుతాయి. మధ్యస్థ కణాలు కిరోసిన్‌ను, బరువైన కణాలు డీజిల్‌ను ఏర్పరుస్తాయి. అయితే రిఫైనింగ్ ప్రక్రియలో కొన్ని రసాయనాలను కలపడం వల్ల, తుది ఉత్పత్తుల పరిమాణం అసలు ముడి చమురు కంటే స్వల్పంగా ఎక్కువగా ఉంటుంది. దీనినే ప్రాసెసింగ్ గెయిన్ అని పిలుస్తారు.
ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితి, ప్రభావం
ప్రస్తుతం అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ప్రపంచ దేశాల మధ్య కీలక సముద్ర మార్గామైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌ను ఇరాన్ తన నియంత్రణలోకి తీసుకోవడం వల్ల ముడి చమురు, గ్యాస్ రవాణా చేసే నౌకల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో గల్ఫ్ దేశాల నుంచి వచ్చే సరఫరా నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, గ్యాస్ కొరత ఏర్పడి ధరలు ఆకాశాన్ని తాకాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.