Viral: ఆస్పత్రికి వచ్చిన వృద్ధుడు.. అతని తొడ చూసి కంగుతిన్న వైద్యులు

రాంబాబు అనే వ్యక్తి ఆస్పత్రికి రాగ.. అతని తొడ పరిమాణాన్ని చూసి వైద్యులు కంగుతిన్నారు. తొడలో 8 కిలోల పైచిలుకు బరువు ఉన్న కణితిని గుర్తించారు. అతని తొడ నుంచి భారీ ట్యూమర్‌ను తొలగించిన SMS ఆసుపత్రి వైద్యులు.. అతనికి మెరుగైన జీవితాన్ని ప్రసాదించారు.

Viral: ఆస్పత్రికి వచ్చిన వృద్ధుడు.. అతని తొడ చూసి కంగుతిన్న వైద్యులు
Rambabu

Updated on: Jun 11, 2025 | 10:52 AM

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని SMS ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ధోల్పూర్ జిల్లా రాజకేరా గ్రామానికి చెందిన రాంబాబు అనే వ్యక్తి తొడ నుంచి ఏకంగా 8.4 కిలోల బరువున్న భారీ ట్యూమర్‌ను తొలగించారు. ఇది ఒక మనిషి తొడ నుంచి తొలగించిన అతిపెద్ద ట్యూమర్‌గా భావిస్తున్నారు.

రాంబాబు ఈ ట్యూమర్‌తో సుమారు 30 ఏళ్లుగా జీవించాడని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సమస్య తీవ్రమవడంతో SMS ఆసుపత్రికి వచ్చాడు. భారీ ట్యూమర్ కారణంగా అతనికి తొడకు వచ్చిన వింత ఆకారం చూసి ఆసుపత్రి సిబ్బంది సహా అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఈ ట్యూమర్‌ తొలగింపు SMS ఆసుపత్రి వైద్యనిపుణుల అద్భుతమైన కృషికి నిదర్శనం. వైద్యులు ఈ శస్త్రచికిత్సను చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణిస్తున్నారు. రామబాబు ఇప్పుడు క్రమంగా కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..