Viral Video: భార్యంటే ఆ మాత్రం భయముండాలి.. తేడా వస్తే అంతే.. ఈ వీడియో చూస్తే మీరే ఒప్పుకుంటారు.!

|

Mar 11, 2022 | 9:27 PM

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వైరల్ వీడియోలు రోజూ హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని కడుపుబ్బా నవ్విస్తాయి...

Viral Video: భార్యంటే ఆ మాత్రం భయముండాలి.. తేడా వస్తే అంతే.. ఈ వీడియో చూస్తే మీరే ఒప్పుకుంటారు.!
Follow us on

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వైరల్ వీడియోలు రోజూ హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక భార్యాభర్తలకు సంబంధించిన వీడియోలు నెట్టింట బోలెడున్నాయి. కొన్ని వారి మధ్య ప్రేమను చూపిస్తే.. మరికొన్ని భార్యతో జాగ్రత్త ఉండాలి సుమీ.. లేదంటే మనం ఖతమే.. అనేలా మనకు జాగ్రత్తలు చెబుతుంటాయి. తాజాగా ఈ కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన తర్వాత మీరు కూడా భార్యంటే కాస్తయిన భయముండాలి అని అంటారు.

వైరల్ వీడియో ప్రకారం.. కిచెన్‌లో ఓ యువతి ఉల్లిపాయ కట్ చేస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఇంతలో ఆమె భర్త అక్కడికి వస్తాడు. అతడు తను తిన్న ప్లేట్‌ను కడగకుండా అక్కడే పెట్టేయడంతో.. ఆమె ఒక్కసారిగా తన కోపం మొత్తాన్ని కత్తితో కోస్తున్న కూరగాయలపై చూపించడంతో.. భర్తగారు బుద్దిగా తాను తిన్న ప్లేట్‌ను శుభ్రంగా కడిగేసి అక్కడ నుంచి వెళ్తాడు. దీనితో ఆమె కూడా శాంతిస్తుంది. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

కాగా, ఈ వీడియోను ‘iamnikitakumawat’ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో 6 రోజుల కిందట అప్‌లోడ్ చేయగా.. లక్షల్లో వ్యూస్ వచ్చి పడుతున్నాయి. అంతేకాకుండా ఈ వీడియోకు 1.9 మిలియన్ లైకులు రావడం విశేషం. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.