Viral Video: ప్రాణాల కోసం ఉక్కిరిబిక్కిరి అవుతున్న గోల్డ్ ఫిష్.. చిన్న ప్లక్కర్‏తో ఎలా రక్షించాడో చూడండి..

| Edited By: Ravi Kiran

Nov 29, 2021 | 7:16 PM

ప్రాణం కోసం పోరాటం.. ఎవరికైనా ఒక్కటే.. మనుషులు అయినా.. జంతువులైనా.. పక్షులైన రోజూ కడుపు నింపుకునేది జీవించడమే

Viral Video: ప్రాణాల కోసం ఉక్కిరిబిక్కిరి అవుతున్న గోల్డ్ ఫిష్.. చిన్న ప్లక్కర్‏తో ఎలా రక్షించాడో చూడండి..
Goldfish
Follow us on

ప్రాణం కోసం పోరాటం.. ఎవరికైనా ఒక్కటే.. మనుషులు అయినా.. జంతువులైనా.. పక్షులైన రోజూ కడుపు నింపుకునేది జీవించడమే కోసమే. కొన్ని సందర్భాల్లో ఆహారంగా తీసుకున్న పదార్థాలే ప్రాణాలను తీసేస్తుంటాయి. ఇటీవల సందర్భాల్లో గొంతులో ఆహారప్పు ముక్క ఇరుక్కుని మరణించిన వార్తలు చాలానే చూశాం. తాజాగా ఈ గోల్డ్ ఫిష్ కూడా ఆహారంగా తీసుకున్న పదార్థమే తన ప్రాణ మీదకు తీసుకొచ్చింది. గడ్డి ముక్క గొంతులో ఇరుక్కుని ప్రాణం కోసం విలవిల కొట్టుంది. దీంతో ఆ విషయం గమనించిన ఓ వ్యక్తి చిన్న పట్టకారుతో గోల్డ్ ఫిష్ ప్రాణాలను కాపాడాడు.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

లూక్స్ గోల్డీస్ అనే యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసిన ఓ వీడియోలో ఓ గోల్డ్ ఫిష్ గొంతులో గడ్డి మొక్క ఇరుక్కొని తెగ ఇబ్బంది పడింది. దీంతో ప్రాణం కోసం ఆ చేప విల విల కొట్టుకుంది. అయితే ఆ చేప పరిస్థితిని గమనించిన ఓ వ్యక్తి వెంటనే ఆ చేపను బయటకు తీసి.. చిన్న పట్టకారుతో ఆ చేప గొంతులో ఇరుక్కున్న గడ్డి మొక్కను బయటకు తీశాడు. దీంతో ఆ గోల్డ్ ఫిష్ బ్రతికింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి.

Also Read:Kamal Haasan: కమల్ హాసన్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన వైద్యులు.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే..

Bigg Boss 5 Telugu Ravi: యాంకర్ రవి పారితోషికం తెలిస్తే షాకవ్వాల్సిందే.. బిగ్‏బాస్ విన్నర్ కంటే ఎక్కువ తీసుకున్నాడా ?..

Taapsee Pannu: అందంగా కనిపించేందుకు ఎంతో కష్టపడ్డాను.. కానీ.. ఆసక్తికర విషయాలను చెప్పిన తాప్సీ..

Bigg Boss 5 Telugu Promo: ప్రియాంకకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన బిగ్‏బాస్.. హౌస్‏లో నామినేషన్స్ హీట్..