Viral: చపాతీలు ఇలా కూడా చేస్తారా..? ఈ మహిళ చేసిన స్టైల్‌కు నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో.!

|

May 22, 2021 | 8:48 AM

Chapati in Pressure Cooker: వంట గదిలో మన అమ్మ చేసే.. కొన్ని ట్రిక్కులను చూస్తే కొన్నిసార్లు ఆశ్చర్యపోతుంటాం...

Viral: చపాతీలు ఇలా కూడా చేస్తారా..? ఈ మహిళ చేసిన స్టైల్‌కు నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో.!
Follow us on

Chapati in Pressure Cooker: వంట గదిలో మన అమ్మ చేసే.. కొన్ని ట్రిక్కులను చూస్తే కొన్నిసార్లు ఆశ్చర్యపోతుంటాం. ఎందుకంటే.. ఇప్పుడున్న జనరేషన్‌కు అసలు కిచెన్‌ రూమ్‌లో ఏ వస్తువు ఎక్కడ ఉందో..? ఏ వంటలో ఏమేమి వేస్తారో కూడా తెలియదు. అయితే కొన్ని సార్లు మన అమ్మ వంటలో వాడే జిమ్మిక్కులను చూసినప్పుడు.. అరే ఇలా కూడా చేస్తారా..? అని షాక్‌ అవుతుంటాం. ఇప్పుడు ఇలాంటి వీడియోనే.. ఒకటి తెగ వైరల్‌ అవుతుంది. ఓ మహిళ చపాతీలు చేసిన తీరు చూసి.. అవాక్కు అవుతున్నారు నెటిజన్స్‌.

Woman’s Cooking 1

సాధరణంగా మెత్తిటి పిండితో చపాతీని గుండ్రంగా చేసి, ఆ తర్వాత రౌండ్‌గా చేసుకుంటుంటాం. ఆపై.. ఓ పెనం మీద వేసి.. రెండు వైపుల చపాతీలను కాల్చుతుంటాం. కానీ ముంబైకి చెందిన మహిళ మాత్రం.. గుండ్రంగా చేసుకున్న మూడు చపాతీలను.. గ్యాస్‌ స్టవ్‌పై ఉన్న ప్రెజర్‌ కుక్కర్‌లో వేసింది. అనంతరం దాని మూతను టైట్‌‌గా పెట్టింది. ఇంకేముంది నిమిషంలో చపాతీలు రెడీ అయ్యాయి.

Woman’s Cooking

ప్రెజర్‌ కుక్కర్‌ ఓ విజిల్‌ వచ్చిన తర్వాత బయటకు తీసిన చపాతీలు చాలా అద్భుతంగా తయారు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో అద్భుతంగా ట్రెండ్ అవుతోంది.

Also Read:

ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..

గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!

SBI కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 డెబిట్ అవుతున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్.!