
భారతీయ సమాజంలో తల్లిదండ్రుల రెండవ వివాహం పట్ల చాలా మంది నెగటివ్ అభిప్రాయాలు కలిగి ఉంటారు. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఒక వార్త, వీడియో ప్రతి ఒక్కరినీ కదిలించింది. అందులో ఒక కూతురు తన తల్లి రెండవ వివాహం గురించి తెలియజేస్తుంది. వీడియోలో తల్లి కొత్త జీవితంలో అడుగు పెట్టిన సందర్భాన్ని చూపిస్తూ, ఆ కుమార్తె చెప్పిన మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేశాయి. ఇంటర్‌నెట్ వేదికగా దీనిని చాలా మంది పాజిటివ్‌గా స్వీకరించారు. తన తల్లి రెండవ వివాహం గురించి వీడియో షేర్ చేసిన కుమార్తె ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే…
అమ్మ పెళ్లి – ఈ మాటలు వింటేనే వింతగా అనిపిస్తుంది. కానీ, చాలా తక్కువ మంది జీవితంలో తమ తల్లి తమ ముందే తిరిగి పెళ్లి చేసుకునే సందర్భాన్ని ఎదుర్కొంటారు. పూజా భట్నాగర్ కు సరిగ్గా ఇదే జరిగింది. ఆమె తన తల్లి పెళ్లి వీడియోను షేర్ చేసింది. తన తల్లిపై చెడు దృష్టి పడకూడదని ప్రార్థిస్తోంది. ఇంటర్‌నెట్‌లో ఈ వీడియో దాదాపు 3 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది. తన తల్లి రెండవ వివాహం గురించి వీడియో షేర్ చేసిన కుమార్తె ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. వీడియోలో తల్లి సంతోషంగా, నూతన ఉత్సాహంతో వివాహ వేడుకలో పాల్గొనడం, అలాగే కుమార్తె ఆమెను సపోర్ట్ చేస్తుందని చెప్పడం స్పష్టంగా కనిపిస్తుంది. నెటిజన్లు ఈ వీడియోను చూసి తల్లికి మద్ధతుగా నిలిచిన ఆ కూతురికి అభినందనాలు. తల్లి కష్టంలో అమ్మలా తోడుతున్న కూతురు ఆమెకు రెట్టింపు ఆనందం అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే, పూజ తల్లి సింగిల్ పేరెంట్. ఆమె తన కూతురిని ఒంటరిగానే పెంచింది. కాబట్టి, తన తల్లిని భాగస్వామితో చూడటం పూజకు సంతోషకరమైన సందర్భం. పూజా ఈ వీడియోను షేర్ చేసింది. వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ వీడియోని చేస్తున్నట్లు వివరించారు. వీరి పెళ్లి 2025లో జరిగి ఒక సంవత్సరం పూర్తైంది. ఏడాది క్రితం వీడియోలను షేర్ చేసింది. వీడియోలోని పార్ట్ 2లో తన తల్లి సింగిల్ పేరెంట్‌గా ఉంటూనే పిల్లలను ధైర్యంగా పెంచడం గురించి మాట్లాడింది. ఇప్పుడు ఆమెకు మద్దతు ఇవ్వడం తన వంతు అని కూడా ఆమె రాసింది.
వీడియో ఇక్కడ చూడండి..
గత సంవత్సరం క్రితం జరిగిన ఈ పెళ్లి వీడియో పట్ల పూజా ఇలా వివరించింది. ఈ వివాహం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న అని చెప్పింది. తన చిరకాల స్వప్నం ఇప్పుడు నెరవేరిందని చెప్పింది. నా తల్లి చివరకు వివాహం చేసుకోబోతోంది అంటూ సంతోషంగా చెప్పింది.
కుమార్తె ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వీడియోను పోస్ట్ చేసింది. వీడియోలో తల్లి కొత్త జీవితంలో సంతోషంగా ఉన్నారని, కుమార్తె ఆమెతో ఉన్నానని ప్రకటించడం హృదయాలను తాకింది. కొంతమంది నెటిజన్లు కామెంట్‌లో ఇలాంటి మద్దతు ప్రతి కుటుంబంలో ఉండాలి అంటున్నారు. ఇది నిజమైన ప్రేమను చూపే ఉదాహరణ అంటూ కూడా చాలా మంది రాశారు. పిల్లల మద్దతు లేకుండా పెద్ద వయసులో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కష్టం అవుతుంది అని కూడా కొందరు పేర్కొన్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..