
గుజరాత్‌లో ఒక వింత ఘటన వెలుగులోకి వచ్చింది. జామ్‌నగర్ ప్రాంతంలో దొంగలు ఒక బైక్‌ను చోరీ చేశారు. కానీ వారు చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడ్డారు. అలాంటి పరిస్థితిలో, మరుసటి రోజు బైక్‌ను చోరీ చేసిన చోటుకు తీసుకువచ్చి మరీ, తిరిగి ఇచ్చి వెళ్లిపోయారు. ఈ సంఘటన నీమ్డా లైన్‌లో జరిగింది.
నీమ్డా లైన్‌లోని ఒక ఇంటి దగ్గర పార్క్ చేసిన బైక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఆ బైక్ రోజంతా దొంగల దగ్గరే ఉంది. కానీ దొంగలు మరుసటి రోజు రాత్రి బైక్‌ను తిరిగి తీసుకుని వచ్చి, ఎక్కడైతే చోరీ చేశారో అక్కడే పెట్టేసి వెళ్లిపోయారు. రెండు రోజుల సంఘటనలు కూడా CCTV కెమెరాలో రికార్డయ్యాయి.
సీసీటీవీ వీడియో ప్రకారం, ఇద్దరు బైక్ రైడర్లు రాత్రి 8 గంటల ప్రాంతంలో ఓ ఇంటి బయట పార్క్ చేసిన బైక్‌ను తీసుకొని పారిపోయారు. సీసీ టీవీ ఫుటేజ్‌లో, దొంగలు బైక్‌ను ఎత్తుకెళ్లిన దృశ్యాలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. అయితే మరుసటి రోజు ముగ్గురు వ్యక్తులు అదే బైక్‌తో అక్కడికి వచ్చారు. ఇద్దరు ఒక బైక్‌పై, మరొకరు దొంగిలించిన బైక్‌పై ఉన్నారు. దొంగిలించిన బైక్‌ను తీసుకెళ్లిన చోటే వదిలి, ముగ్గురు వ్యక్తులు బైక్‌పై పారిపోయారు. ఈ ఆసక్తికర ఘటనతో స్థానికులతోపాటు పోలీసులు షాక్ అవుతున్నారు.
ఇదిలావుంటే, భారతదేశంలో బైక్ దొంగతనం నేరపూరిత చర్య. భారత శిక్షాస్మృతి (IPC) ప్రకారం శిక్షార్హమైనది. సాధారణంగా బైక్ దొంగతనం చేస్తే పలు సెక్షన్ల కింద శిక్ష విధించే అవకాశం ఉంది.
BNS సెక్షన్ 302: దొంగతనం ఒక వ్యక్తి మరొకరి ఆస్తిని అతని అనుమతి లేకుండా స్వాధీనం చేసుకుంటే, దానిని దొంగతనంగా పరిగణిస్తారు. శిక్ష: మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ ఉంటాయి.
BNS సెక్షన్ 311: దొంగిలించిన వస్తువులను కలిగి ఉన్నందుకు శిక్ష విధిస్తారు. ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా దొంగిలించిన వస్తువులను కలిగి ఉంటే, అతనికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించబడవచ్చు.
BNS సెక్షన్ 320: దోపిడీ శిక్ష: దొంగతనం సమయంలో బలవంతం లేదా హింసను ఉపయోగిస్తే, అది దోపిడీగా పరిగణిస్తారు. దానికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశముంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..