Viral Video: సై అంటే సై.. అమ్మాయిలతో కలిసి ఫుట్‏బాల్ ఆడాలనుకున్న ఆవులు.. కట్ చేస్తే..

|

Jun 21, 2022 | 4:29 PM

అందులో కొందరు అమ్మాయిల నిర్మానుష్యమైన ప్రదేశంలో ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు. వారు ఎంతో జోష్ గా ఆట ఆడుతున్న సమయంలో బాల్ వెళ్లి..

Viral Video: సై అంటే సై.. అమ్మాయిలతో కలిసి ఫుట్‏బాల్ ఆడాలనుకున్న ఆవులు.. కట్ చేస్తే..
Viral
Follow us on

సాధారణంగా ప్రమాదాలు ఎప్పుడు ఎలా.. ఎటువైపు నుంచి వస్తాయో ఊహించడం కష్టం.. కొన్నిసార్లు అనుకోకుండా జరిగే చిన్న చిన్న పొరపాట్ల వలన జరిగే ప్రమాదాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా జంతువుల పట్ల అచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కోతులు, ఏనుగులు, గుర్రాలు, కుక్క పిల్లలు, పిల్లులు, ఆవులు, గేదేలు ప్రశాంతంగా కనిపించినప్పటికీ కొన్నిసార్లు మనకు ప్రమాదం కలిగిస్తాయి. వాటి దగ్గరకు వెళ్లాలని ప్రయత్నించినా.. అవి కోపంతో మనపై దాడి చేసే సందర్భాలు అధికంగా ఉంటాయి. తాజాగా అలాంటి సంఘటనే ఈ అమ్మాయిల విషయంలోనూ జరిగింది. ఆవులే కదా అని దగ్గరకు వెళితే అమ్మాయిలను భయంతో పరుగులు పెట్టించాయి. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

అందులో కొందరు అమ్మాయిల నిర్మానుష్యమైన ప్రదేశంలో ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు. వారు ఎంతో జోష్ గా ఆట ఆడుతున్న సమయంలో బాల్ వెళ్లి.. అక్కడే కొద్ది దూరంలో ఉన్న ఆవుల వద్ద పడింది. దీంతో ఆ ఆవులు బాల్ దగ్గరకు చేరి తదేకంగా దానిని చూస్తూ నిల్చున్నాయి. అయితే బాల్ తీసుకురావడానికి ఇద్దరు అమ్మాయిలు వాటి దగ్గరకు వెళ్లారు.. ఓ అమ్మాయి దూరంగా నిలబడి ఆవులను బెదిరిస్తుండగా.. మరొక అమ్మాయి మాత్రం చేతిలో కర్ర పట్టుకుని ఆవుల వద్దకు వెళ్లింది. దీంతో కొన్ని ఆవులు అక్కడి నుంచి వెళ్లిపోగా..మరో నల్ల ఆవు మాత్రం అమ్మాయికి ఎదురుతిరిగింది. ఇంకేముందు తనను కాపాడుకోవడానికి అమ్మాయిలు పరుగులు పెట్టగా.. ఆవు కూడా వారిని వెంబడించింది. ఇదంతా అక్కడే ఉన్న మరో అమ్మాయి వీడియో తీసింది.. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీనికి ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.. మీరు చూసేయ్యండి..

మరిన్ని  ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి.