Girl and Giant Python shocking video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా ఓ భారీ పాముకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా పాము పేరు వింటేనే చాలామంది భయంతో పరుగుతు తీస్తుంటారు. వాటిని దగ్గర చూస్తే.. మనస్సులో కలిగే భయం ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అత్యంత విషపూరితమైన జీవిలో ఎన్నో రకాలున్నాయి. అందుకే అందరూ వాటి నుంచి దూరంగా ఉంటారు. కానీ ఓ అమ్మాయి మాత్రం తన పెంపుడు కుక్కలాగా.. పెద్ద కొండచిలువపై ప్రేమను కురిపిస్తూ కనిపించింది. ఈ సమయంలో.. కొండచిలువ కూడా హాయిగా సేదతీరుతూ కనిపించింది. సోషల్ మీడియా (Social Media) లో వైరల్‌గా మారిన ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికైనా హార్ట్ బీట్ పెరుగుతుంది. ఫైథాన్ పెద్దదిగా.. ప్రమాదకరంగా కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఇంటర్నెట్‌లోని ప్రజలు చాలా ఆశ్చర్యపోతున్నారు. బాలిక దగ్గర ఉండటం.. ప్రమాదకరం అంటూ హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు గుండె బలహీనంగా ఉన్నవారు వీడియో చూడకపోవడమే మంచిదంటూ సలహా ఇస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక పెద్ద కొండచిలువ కనిపించింది. అదే సమయంలో.. కెమెరా యాంగిల్ మారిన వెంటనే ఒక అమ్మాయి ఆ కొండచిలువను ప్రేమతో లాలించడం కనిపిస్తుంది. పాము ఎంత పొడవుగా.. భారీగా ఉందో మీరు చూడవచ్చు. కానీ అమ్మాయి ముఖంలో భయం లేదు. పెద్ద కొండచిలువ పక్కనే ఉన్న అమ్మాయి.. నవ్వుతూ కనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూడండి..
వైరల్ వీడియో.. చూడండి
ఈ షాకింగ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో munding_aji అనే యూజర్ షేర్ చేయగా.. లక్షలాది మంది వీక్షించి 41 వేల మందికిపైగా లైక్ చేశారు. దీంతోపాటు నెటిజన్లు ఈ వీడియోపై పలు రకాల కామెంట్లు చేస్తున్నారు