Ghibli Style Optical illusion: మీ మైండ్ షార్ప్ అయితే దాగున్న పిల్లుల్ని కనుక్కోండి చూద్దాం..!

ఈ గిబ్లి-స్టైల్ ఆప్టికల్ ఇల్యూషన్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో అనేక పిల్లులు దాగి ఉన్నాయి. మీరు వాటిని గుర్తించగలరా..? ఈ ఆసక్తికరమైన మాయా దృశ్యాన్ని పరిశీలించి మీ గమనించే నైపుణ్యాన్ని పరీక్షించుకోండి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఛాలెంజ్‌ అందర్నీ ఆకర్షిస్తోంది.

Ghibli Style Optical illusion: మీ మైండ్ షార్ప్ అయితే దాగున్న పిల్లుల్ని కనుక్కోండి చూద్దాం..!
Ghibli Style Optical Illusion

Updated on: Apr 02, 2025 | 7:07 PM

ఈరోజు మీ కోసం మరో ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్‌ను తీసుకొచ్చాం. ఇది చూడటానికి ఒక అందమైన కళాచిత్రంలా కనిపించినప్పటికీ, ఇందులో చాలా చిన్న పిల్లులు దాగి ఉన్నాయి. ఈ మాయా దృశ్యాన్ని పరిశీలించి వాటిని గుర్తించగలరా..? మీ గమనించే నైపుణ్యాన్ని పరీక్షించుకునేందుకు ఇదే సరైన అవకాశం. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పాల్గొని ప్రయత్నించండి.

మీరు చూస్తున్న ఈ గిబ్లి-స్టైల్ ఇమేజ్ ని ఏఐ క్రియేట్ చేసింది. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ ప్రత్యేకమైన ఇమేజ్ లో అనేక పిల్లులు దాగి ఉన్నాయి. మామూలుగా చూసినప్పుడు కనిపించకపోవచ్చు కానీ బాగా ఫోకస్ చేసి చూస్తే మీకు అవి కనిపిస్తాయి. ఇప్పటికే ఈ ఇమేజ్‌ను చూసిన చాలా మంది దీనిని ఆసక్తిగా గమనిస్తూ, దాగి ఉన్న పిల్లులను లెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ చిత్రంలో పచ్చని గడ్డి, అందమైన ప్రకృతి మధ్యన ఒక కొండ కనిపిస్తుంది. అయితే ఈ కొండ పిల్లి ముఖంలా ఉండటం విశేషం. పిల్లి ముక్కు, మీసాలు సహజంగా ల్యాండ్‌స్కేప్‌లో కలిసిపోయాయి. చూడటానికి ఇది సాధారణ ప్రకృతి దృశ్యం లా అనిపించినా లోతుగా పరిశీలిస్తే దీనిలో మరెన్నో విశేషాలు దాగి ఉన్నాయి.

గ్రామంలోని పలు ప్రదేశాల్లో పిల్లులే పిల్లులు. కొన్ని ఇళ్ల ముందు నిద్రపోతుంటే, మరికొన్ని గ్రామం మధ్యలో ఉన్న చెరువు దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఇంకొన్ని పిల్లులు గ్రామపు చిన్న చిన్న రహదారుల వెంట అడుగడుగునా దాగి ఉన్నాయి. గ్రామం ముందు భాగంలో ఓ పెద్ద బూడిద రంగు పిల్లి ఇంటి పక్కన ప్రశాంతంగా నిద్రపోతుంది. అంతేకాదు ఓ ఇంటి తలుపు దగ్గర నుంచి పిల్లి లాగా మరేదో జీవి కూడా దాగి ఉంది.

ఈ చిత్రంలో దాగివున్న పిల్లుల్ని గుర్తించాలంటే చాలా ఓపికతో, ప్రశాంతంగా, క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. అయితే మీరు మొదట చూడగానే అన్ని పిల్లుల్ని ఒకేసారి కనిపెట్టలేరు. మీరు బాగా ఫోకస్ చేసి చూస్తేనే కనిపెట్టగలరు.

ఇప్పటికే చాలా మంది ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌ను పరీక్షిస్తూ తమ తమ లెక్కలు చెబుతున్నారు. కొందరికి 8 పిల్లులు కనిపిస్తే, మరికొందరికి 10-12 పిల్లులు కనిపిస్తున్నాయి. మరి మీరు ఎన్ని పిల్లులను కనిపెట్టారు. ఈ ఇమేజ్‌ను గమనించి దాగివున్న పిల్లులను లెక్కించి మీ సమాధానాన్ని చెప్పండి.