Viral Video: ఆహా.. ఈ కోతి పిల్లది ఏమి రాజసం గురూ.. ఫ్రీగా ఎంజాయ్ చేస్తోంది..!

Viral Video: కొన్ని కోతులు హడలెత్తిస్తాయి గానీ.. సాధారణంగా కోతి ఏం చేసినా సరదాగానే ఉంటుంది. దాని లక్షణాలు, ఐడియాలజీ, ఆలోచనలు, చేష్టలు.. దాదాపు అన్నీ మనిషిని పోలి ఉంటాయి.

Viral Video: ఆహా.. ఈ కోతి పిల్లది ఏమి రాజసం గురూ.. ఫ్రీగా ఎంజాయ్ చేస్తోంది..!
Monkey

Updated on: Dec 04, 2021 | 6:11 AM

Viral Video: కొన్ని కోతులు హడలెత్తిస్తాయి గానీ.. సాధారణంగా కోతి ఏం చేసినా సరదాగానే ఉంటుంది. దాని లక్షణాలు, ఐడియాలజీ, ఆలోచనలు, చేష్టలు.. దాదాపు అన్నీ మనిషిని పోలి ఉంటాయి. అయితే, అవి చేసే చేష్టలు ఎంతగానో అకట్టుకుంటాయి. ఇలాంటి కోతి చేష్టలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేకం వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ కోతి పిల్లకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కోతి ఎంచక్కా పిల్లి వీపుపై ఎక్కి.. దర్జాగా స్వారీ చేస్తుంటుంది. ఆ పిల్లేమో.. కోతిని హాయిగా తిప్పుతుంది. ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు తమ చూపు తిప్పుకోలేకపోతున్నారంటే అతిశయోక్తి కాదు.

స్నేహితులు లేని వ్యక్తులు ఈ లోకంలో ఉండరంటే అతిశయోక్తి కాదు. మంచి స్నేహితుడిని సంపాదించుకోవడం కూడా ఒక అదృష్టమే. స్నేహ మాధుర్యాన్ని మాటల్లో వర్ణించలేం. ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే అవుతుంది. అయితే, ఈ స్నేహ నియమం మనుషులకే కాదు.. జంతువులకు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వైరల్‌లో వీడియోలో కోతి, పిల్లి స్నేహం అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియోలో ఓ పిల్లి.. కోతి పిల్లను తన వీపుపై ఎక్కించుకుని కలియతిరుగుతుంది. పిల్లి వీపుపై హాయిగా పడుకున్న కోతి.. దర్జాగా స్వారీ చేస్తుంది. పిల్లి నెమ్మదిగా నడిచినంత సేపు.. ప్రశాంతంగా రైడింగ్‌ను ఎంజాయ్ చేసింది కోతి. అయితే, పిల్లి ఉన్నపళంగా వేగం పెంచడంతో ఆందోళన చెందని కోతి.. కిందకు దూకేసింది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్‌లో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. పిల్లి, కోతి స్నేహం అందరి హృదయాలను గెలుచుకుందన్నారు. ఈ వైరల్ వీడియోను మీరూ ఎంజాయ్ చేయండి.

Viral Video:

Also read:

14 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 20 నిమిషాల్లో మ్యాచ్ ముగించాడు.. సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లకు దబిడి దిబిడే.!

Zodiac Signs: ఈ 6 రాశులవారు తమ తప్పుల నుంచి నేర్చుకుంటారు.! ఏయే రాశులంటే?

IPL 2022: సన్‌రైజర్స్ బిగ్ స్కెచ్.. వార్నర్‌ను రీప్లేస్ చేసేది టీమిండియా టీ20 స్పెషలిస్ట్.. ఎవరో తెలుసా?

Viral Photo: ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!

Loading...
Unable to load recommendations.
Follow Us