Viral Video: మగజాతి ఆణిముత్యాలు వీరే.. కొత్త జంటతో ఏం చేశారో చూస్తే బాక్సులు బద్దలైనట్లే!

వధూవరుల స్నేహితుల అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేదికపైనే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురును ఆటపట్టించడం...

Viral Video: మగజాతి ఆణిముత్యాలు వీరే.. కొత్త జంటతో ఏం చేశారో చూస్తే బాక్సులు బద్దలైనట్లే!
Viral Video

Updated on: Apr 04, 2022 | 4:43 PM

పెళ్లిళ్లు అంటేనే మహా సరదాగా ఉంటాయి. బంధువుల కబర్లు, స్నేహితుల అల్లరి.. అమ్మలక్కల ఆర్బాటాలు.. వరుడు ఫ్రెండ్స్ చేసే చిలిపి చేష్టలు.. ఇలా ఒకటేమిటీ ఎన్నో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. వధూవరుల స్నేహితుల అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేదికపైనే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురును ఆటపట్టించడం.. వెరైటీ గేమ్స్ ఆడించడం చేస్తుంటారు.. అయితే ఇక్కడ వరుడు స్నేహితులు కాస్త శృతిమించారు. వధూవరులకు మ్యాంగో జ్యూస్ ఇస్తున్నట్లుగా.. వెనుక వేరే కథ నడిపించారు.. మీరూ వీడియో చూస్తే కచ్చితంగా షాక్ కావడం ఖాయం..

వైరల్ వీడియో ప్రకారం.. ఇద్దరు ఫ్రెండ్స్ గ్లాస్‌లోని విస్కీని సిరంజీలో నింపుతున్నట్లు మీరు చూడవచ్చు. ఇక దాన్ని కాస్తా మ్యాంగో జ్యూస్ డబ్బాలో జాగ్రత్తగా కలిపారు. అది తీసుకెళ్లి వధూవరులకు ఇచ్చి.. వారి చేత తాగించారు. ఫ్రెండ్స్ తనకు జ్యూస్ తీసుకొచ్చారనుకుని సంతోషపడిన వరుడు.. పాపం! అందులో ఏముందో తెలియకుండా తాగేశాడు. చివరికి దాని టేస్ట్ అదోలా ఉండేసరికి వెరైటీ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా, ఈ వీడియోను ‘brides_special’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ అప్‌లోడ్ చేయగా.. ఇప్పటివరకు 70 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే 3500లకు పైగా లైకులు వచ్చి పడ్డాయి. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us