భూమి అమ్మి 13 లక్షలు బ్యాంక్‌లో దాచిన తండ్రి.. ఫ్రీ ఫైర్‌ ఆడి పోగొట్టిన కొడుకు! విషయం తెలియడంతో..

14 ఏళ్ల యష్ అనే బాలుడు ఫ్రీ ఫైర్ ఆటకు బానిసై, తండ్రి బ్యాంకు ఖాతా నుండి రూ. 13 లక్షలు పోగొట్టాడు. ఈ ఘటనతో మానసికంగా కుంగిపోయిన యష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్‌లైన్ గేమ్స్ వ్యసనం పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భూమి అమ్మి 13 లక్షలు బ్యాంక్‌లో దాచిన తండ్రి.. ఫ్రీ ఫైర్‌ ఆడి పోగొట్టిన కొడుకు! విషయం తెలియడంతో..
Online Game

Updated on: Sep 16, 2025 | 10:48 PM

ప్రస్తుత కాలంలో పిల్లలు మొబైల్‌ ఫోన్లకు విపరీతంగా అడిక్ట్‌ అవుతున్నారు. అన్నం తినాలన్నా, అల్లరి చేయకుండా ఉండాలన్న, ఏడుపు ఆపాలన్నా.. వాళ్ల ఏది చేయాలన్నా చేతిలో ఫోన్‌ పెట్టాల్సిందే. మరీ చిన్న పిల్లల పరిస్థితి ఇలా ఉంటే.. కాస్త పెద్ద పిల్లల పరిస్థితి అయితే మరీ ఘోరం. స్కూల్‌ నుంచి రావడంతో ఫోన్లో ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతూ కూర్చోవడం. ముఖ్యంగా ఫ్రీ ఫైర్‌ అనే గేమ్‌కు బాగా అలవాటు పడిపోయారు. చాలా మంది పిల్లలకు అదో వ్యసనంలా మారిపోయింది. ఆ వ్యసనం ఓ చిన్నారి నిండు ప్రాణాలను బలితీసుకుంది. అలాగే అతని తండ్రికి రూ.13 లక్షల నష్ట మిగిల్చింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లక్నోలోని మోహన్‌లాల్‌గంజ్‌లో నివసించే 14 ఏళ్ల యష్ అనే కుర్రాడు.. ఫోన్‌లో ఫ్రీ ఫైర్‌ ఆడుతూ రూ.13 లక్షలు పోగొట్టాడు. యష్ తండ్రి కొన్ని రోజుల క్రితం భూమి అమ్మగా వచ్చిన రూ.13 లక్షలను తన బ్యాంక్‌లో డిపాజిట్‌ చేశాడు. అయితే ఆ బ్యాంక్‌ అకౌంట్‌, ఫోన్‌ నంబర్‌కు లింక్‌ అయి ఉండటం, యష్‌ అదే ఫోన్‌లో ఫ్రీ ఫైర్‌ ఆడుతూ.. వెపన్స్‌ పర్చేజ్‌కోసం తనకు తెలియకుండానే ఆన్‌లైన్ పేమెంట్‌ సెట్టింగ్‌ యాక్టివేట్‌ చేసి పెట్టడంతో మెల్లమెల్లగా అకౌంట్‌లోని రూ.13 లక్షలు కరిగిపోయాయి.

తీరా ఒక రోజు యష్‌ తండ్రి తనకు కొంత డబ్బు అవసరం అయి బ్యాంక్‌కు వెళ్లగా.. బ్యాంక్‌ వాళ్లు అతనికి ఊహించని షాక్‌ ఇచ్చారు. అకౌంట్‌లో అసలు డబ్బుల లేదని అన్నారు. దాంతో అతనికి గుండె ఆగినంత పనైంది. డబ్బు ఏమైందని హిస్టరీ చూడగా.. ఫ్రీ ఫైర్‌కు పేమెంట్‌ చేసినట్లు ఉంది. ఇంటికొచ్చి కొడుకు ఈ విషయమై ప్రశ్నించగా.. ఆ కుర్రాడు భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక వైపు డబ్బు పోయిందనే బాధలో ఉంటే ఏకంగా కన్న కొడుకే చనిపోవడంతో పాపం ఆ తండ్రిని శోకసంద్రంలో మునిగిపోయాడు. దీనంతటికీ కారణం ఆన్‌లైన్‌ గేమ్స్‌కు అలవాటు పడటమే అని నిపుణులు అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి