
కింగ్ కోబ్రాను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన పాములలో ఒకటి. అది కరిచి సకాలంలో చికిత్స పొందకపోతే, మరణానికి దారితీస్తుంది. అందుకే జనం ఈ పాముకు చాలా దూరంగా ఉంటారు. అయితే, కొంతమంది అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను సైతం పట్టుకునేందుకు సాహసం చేస్తారు. ఈ రకమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసినవారిలో వణుకు పుట్టిస్తోంది. 18 అడుగుల పొడవైన కింగ్ కోబ్రాను పట్టుకునే ప్రమాదకరమైన దృశ్యాన్ని ఈ వీడియోలో బంధించారు. అంత పెద్ద కింగ్ కోబ్రాను నియంత్రించడానికి చేసిన ప్రయత్నం ఊపిరాడకుండా చేసింది.
ఈ వీడియోలో , కొంతమంది అటవీ శాఖ ఉద్యోగులు ఒక పెద్ద కింగ్ కోబ్రాను పట్టుకుని మెష్ బాక్స్‌లో ఉంచడానికి ప్రయత్నించారు. ఆ పాము పరిమాణం చాలా పెద్దది కాబట్టి చూడటానికి భయంకరంగా ఉంది. అయితే, ఒక అటవీ శాఖ ఉద్యోగి కింగ్ కోబ్రా నోటిని పట్టుకోగా, మరొకరు దాని తోకను పట్టుకున్నారు. దీని తరువాత, మెష్ బాక్స్‌లో ఉంచే ప్రక్రియ ప్రారంభమైంది. అతి కష్టం మీద అటవీ శాఖ ఉద్యోగులు దానిని పెట్టె లోపల ఉంచారు. అదృష్టవశాత్తూ, ఈ సమయంలో కింగ్ కోబ్రా వారిపై దాడి చేయడానికి ప్రయత్నించలేదు, లేకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కొవల్సి వచ్చేది.
ఈ అద్భుతమైన వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @VegBiryani108 అనే ఖాతా ద్వారా షేర్ చేశారు. “అటవీ శాఖ అధికారులు 18 అడుగుల కింగ్ కోబ్రాను ఎలా రక్షించారో చూడండి” అనే క్యాప్షన్‌తో పంచుకున్కనారు. ఈ 35 సెకన్ల వీడియోను 74,000 సార్లు వీక్షించారు. వందలాది మంది లైక్‌లు, వివిధ రకాల ప్రతి స్పందనలు తెలియజేశారు. వీడియో చూసిన తర్వాత, ఒకరు “వాళ్ళు భయపడటం లేదా?” అని అడిగారు. మరొకరు, “ఈ వీడియో చూసి నేను భయపడుతున్నాను” అని అన్నారు. అదేవిధంగా, మరొకరు, “ఇది అడవిలో నివసించే, పనిచేసే వ్యక్తుల దినచర్య” అని రాశారు. మరొకరు, “భయపడటానికి ఏముంది? పాముల మధ్య జీవించండి, సాధన చేయండి, భయం పోతుంది” అని ఇంకొకరు పేర్కొన్నారు.
వీడియోను ఇక్కడ చూడండిః
Watch how forest department officials rescued an 18-foot king cobra! 💀 pic.twitter.com/l8ifCo1lkL
— Shivam_007 (@VegBiryani108) March 8, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..