Viral Video: జీవితం అందరికీ ఒకేలా ఉండదు.. వర్షంలో తడుస్తున్న డెలివరీ బాయ్.. గుండె బరువెక్కిస్తున్న వీడియో

అయితే, ప్రస్తుత కాలంలో ఫుడ్ డెలివరీ ఆప్స్ విపరీతంగా వచ్చేశాయి. వీటి ద్వారా పెద్దగా బయటకువెళ్లే పని లేకుండానే మన పనిని పూర్తి చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు..

Viral Video: జీవితం అందరికీ ఒకేలా ఉండదు.. వర్షంలో తడుస్తున్న డెలివరీ బాయ్.. గుండె బరువెక్కిస్తున్న వీడియో
Food Delivery Boy

Updated on: Jul 26, 2022 | 9:10 PM

Viral Video: ప్రతి ఒక్కరూ తన కుటుంబాన్ని, తమపై ఆధారపడి ఉన్న వారికి ఏ లోటూ రాకుండా చూసుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. కొంతమంది తాము చదివిన చదువుకు సంబంధం లేని పని చేస్తూ కుటంబానికి ఆసరాగా ఉంటారు. వారు చేసే పనిలో కష్టాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని ముందుకు సాగిపోతుంటారు. తాము చేస్తున్న పని పట్ల అమితమైన ప్రేమను కనబరుస్తుంటారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దృఢ నిశ్చయంతో పని చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత కాలంలో ఫుడ్ డెలివరీ ఆప్స్ విపరీతంగా వచ్చేశాయి. వీటి ద్వారా పెద్దగా బయటకువెళ్లే పని లేకుండానే మన పనిని పూర్తి చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు.. వీటిని ఆధారంగా చేసుకుని ఎంతోమంది చిరుద్యోగులు జీవనం కొనసాగిస్తున్నారు. మనం ఇంట్లో ఉండి ఆర్డర్ చేస్తే.. వారు మాత్రం బయటకు వచ్చి డెలివరీ చేస్తూ ఉంటారు. అలాంటి వారి వృత్తిని నిజంగా మెచ్చుకోవాల్సిందే. కాగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ డెలివరీ బాయ్ వీడియో వైరల్ గా మారింది.

భారీగా వర్షం కురుస్తున్న సమయంలో పుడ్ డెలివరీ బాయ్ కు ఆర్డర్ వచ్చింది. అతను తన ఆర్డర్ ను కస్టమర్ వద్దకు చేర్చేందుకు బయల్దేరతాడు. మార్గమధ్యలో భారీ వర్షం కురవడం మొదలవుతుంది. అదే సమయంలో అతను ట్రాఫిక్ సిగ్నల్ వద్ద చిక్కుకుంటాడు. ఈ వీడియోలో అతను వర్షంలో పూర్తిగా తడిచిపోయాడు. అతని వద్ద గొడుగు గానీ, రెయిన్ కోట్ గానీ ఏదీ లేదు. అలాగే వర్షంలో తడుస్తూ గమ్యానికి చేరుకోవాలని ఆరాటపడుతున్నాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ అయింది. దీనిని చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో హృదయాన్ని బరువెక్కించిందని వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us