
ఒక రైతు ఖరీదైన కొత్త మెర్సిడెస్ జి-వ్యాగన్ కారును కొనుగోలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ కారు విలువ దాదాపు రూ. 3 కోట్లు. ఆ రైతు తన సాంప్రదాయ దుస్తులైన ధోతీ, కుర్తాలో వచ్చి కారును కొనుగోలు చేశాడు. ఈ సన్నివేశం చిరంజీవి, విజయ్ కుమార్ నటించిన స్నేహం కోసం లోని సన్నివేశానికి దగ్గరా ఉంది. రైతులు కూడా ఖరీదైన కారును కొనుగోలు చేయగలరు అని చెప్పే ఈ సన్నివేశం ఇన్ని ఏళ్ళు అయినా ఆకట్టుకున్తూనే ఉంది. ఇప్పుడు అదే విధంగా ఒక రైతు సాంప్రదాయ దుస్తులైన దోతీ కుర్తా ధరించి కారు షో రూమ్ కి వచ్చి ఖరీదైన కారు కొనుగోలు చేశాడు.
రైతు తన భార్యతో కలిసి షో రూమ్ కి వచ్చాడు. అక్కడ మెర్సిడెస్ GLఎస్ (GLS) మోడల్ కారును ఎంచుకుని దానిని కొన్నాడు. ఆ రైతు ఎంచుకున్న మెర్సిడెస్ జీ వాగన్ ఎస్‌యూవీ (G-Wagon SUV) కారు ధర రూ. 3 కోట్లు. కారుకి డబ్బు చెల్లించిన తర్వాత తన కొత్త కారుకి పూలమాల వేశాడు. ఆ రైతు భార్య సాంప్రదాయాన్ని అనుసరించి కారుకు పసుపు కుంకుమ పెట్టి.. హారతి ఇచ్చి పూజలు చేసింది. కారులో దర్జాగా కూర్చున్న రైతు.. కారుని డ్రైవ్ చేసుకుంటూ బయటకు వస్తున్నాడు.
ఈ వీడియో ను ఇన్‌స్టాగ్రామ్‌లో రైతులను తక్కువ అంచనా వేయవద్దు అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. రైతు దంపతులు షోరూమ్‌లోకి ప్రవేశించారు. అతని భార్య కొత్త కారుని పూజలు చేసిన తర్వాత కారులో రాజసంగా కూర్చుని.. దేవుడిని తలచుకుంటూ ప్రత్యేక ప్రార్థన చేసి.. కాలోని ఫీచర్లను పరిశీలించి కారుని స్టార్ట్ చేశాడు. నవ్వుతూ కారును నడుపుకుంటూ షోరూమ్ నుంచి దర్జాగా బయటకు వచ్చాడు.
ఈ పోస్ట్ వీడియో సోషల్ మీడియాలో భారీ ఆదరణను సొంతం చేసుకుంది. కొంతమంది నెటిజన్లు ఇది పాత వీడియో మళ్లీ వైరల్ అవుతోందని కామెంట్ చేస్తున్నారు. అయితే చాలా మంది రైతు కూడా కొన్ని కోట్ల విలువైన కారును కొనగలడు అని చూపిస్తున్న వీడియో మాకు నచ్చిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..