Viral Video: తవ్వకాలు జరుపుతుండగా కనిపించిన పురాతన కుండ.. దాన్ని ఓపెన్ చేయగా కళ్లు చెదిరే.!

ఉన్నట్టుండి మీకు పురాతన వస్తువులు దొరికితే.. మీకేం అనిపిస్తుంది.! మన చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు.. గుప్తనిధుల కోసం చేసే అక్రమ తవ్వకాల్లో కంటే.. పాత ఇళ్లు కూల్చుతున్నప్పుడే ఎక్కువ దొరుకుతుంటాయి. పాత ఇళ్లు కుల్చుతుండగా బంగారు నాణేలు..

Viral Video: తవ్వకాలు జరుపుతుండగా కనిపించిన పురాతన కుండ.. దాన్ని ఓపెన్ చేయగా కళ్లు చెదిరే.!
Representative Image

Updated on: Apr 17, 2024 | 12:15 PM

ఉన్నట్టుండి మీకు పురాతన వస్తువులు దొరికితే.. మీకేం అనిపిస్తుంది.! మన చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు.. గుప్తనిధుల కోసం చేసే అక్రమ తవ్వకాల్లో కంటే.. పాత ఇళ్లు కూల్చుతున్నప్పుడే ఎక్కువ దొరుకుతుంటాయి. పాత ఇళ్లు కుల్చుతుండగా బంగారు నాణేలు, పొలాన్ని దున్నుతుండగా వజ్రాలు.. పురాతన దేవాలయాల రూపురేఖలను మార్చుతుండగా బయటపడే చారిత్రిక ఆనవాళ్లు లాంటివి మనం చూస్తూనే ఉంటాం. ఇక ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఈ తరహ వీడియో ఒకటి నెట్టింట విపరీతంగా సందడి చేస్తోంది. ఓ వ్యక్తి పురావస్తు తవ్వకాలు జరుపుతుండగా.. అతడికి ఓ పురాతన మట్టి కుండ లభించింది. ఇక దాన్ని తెరిచి చూడగా.. కళ్లు చెదిరేలా.. కుప్పలు తెప్పలుగా పురాతన నాణేలు కనిపించాయి. ఈ పురావస్తు తవ్వకాలు ఏ ప్రాంతంలో జరిగాయో తెలియదు గానీ.. సదరు వ్యక్తి ఓ ట్రెజర్ హంటర్ అని తెలుస్తోంది. ఎప్పటికప్పుడు పురావస్తు తవ్వకాలు జరుపుతుంటాడు. చిత్రవిచిత్రమైన వస్తువులను కనిపెడుతుంటాడు. లేట్ ఎందుకు ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us