ఏనుగమ్మ ఏనుగు.. కారెక్కింది ఏనుగు !

|

Nov 06, 2019 | 3:35 PM

ఎక్కడా లేనట్టు ఓ భారీ గజరాజం కారు టాప్ మీదెక్కి కూర్చుంది. తన బరువైన శరీరాన్ని ఆ వాహనం టాప్ మీద మోపింది… . అసలు ఆ బరువుకు కారు నుజ్జు..నుజ్జు.. కార్లోనివారు పప్పు.. పప్పు కావలసిందే ! కానీ.. సరైన ఆసరా లేకపోవడంతో ఏనుగు… టాపు మీద జారినంత పనయి పక్కకు తొలగింది. అంతే ! కారు డ్రైవర్ బతుకు జీవుడా అంటూ జర్రున తన వాహనాన్ని ముందుకు పొనిచ్చాడు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ […]

ఏనుగమ్మ ఏనుగు.. కారెక్కింది ఏనుగు !
Follow us on

ఎక్కడా లేనట్టు ఓ భారీ గజరాజం కారు టాప్ మీదెక్కి కూర్చుంది. తన బరువైన శరీరాన్ని ఆ వాహనం టాప్ మీద మోపింది… . అసలు ఆ బరువుకు కారు నుజ్జు..నుజ్జు.. కార్లోనివారు పప్పు.. పప్పు కావలసిందే ! కానీ.. సరైన ఆసరా లేకపోవడంతో ఏనుగు… టాపు మీద జారినంత పనయి పక్కకు తొలగింది. అంతే ! కారు డ్రైవర్ బతుకు జీవుడా అంటూ జర్రున తన వాహనాన్ని ముందుకు పొనిచ్చాడు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. థాయిలాండ్ లోని ఖానో యాయీ నేషనల్ పార్కులో జరిగిందీ సంఘటన. 35 ఏళ్ళ ‘ దువియా ‘ అనే ఆ ఏనుగు కారు టాపు మీద ఎక్కబోయిన ఈ వైనం తాలూకు వీడియో వైరల్ అవుతోంది.