ఏనుగుల దాడికి సంబంధించిన అనేక వీడియోలు చాలా సార్లు వైరల్ అవుతుంటాయి. రోడ్డుపై వెళ్తున్న వారిపై ఏనుగులు దాడి చేయడం, సఫారీకి వెళ్లిన వారిపై ఏనుగు దాడి చేయటం వంటివి అనేకం మనం సోషల్ మీడియాలో తరచూ చూస్తునే ఉంటాం. తాజాగా అలాంటి వీడియో ఒకటి సర్వత్రా వైరల్‌గా మారింది. ఒక ఏనుగు భయంకరమైన రూపంలో కనిపించింది. పెళ్లి ఫోటో షూట్‌లో ఓ జంటపై ఏనుగు దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. నిజానికి పెళ్లి తర్వాత ఈ జంట వీడియోలు, ఫోటోలు తీసుకుంటున్న సమయంలో ఈ దృశ్యం కెమెరాకు చిక్కింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. ఈ వీడియో క్యాప్షన్‌లో ఇలా క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. ఈ ఘటనకు మేము బాధ్యులం కాదు. ఏనుగుల దాడుల గురించి నెగిటివ్ ప్రచారం చేయడం సీరియస్ విషయం అని రాశారు. ఈ ఫోటోషూట్‌లో ఇది అనూహ్యంగా జరిగిపోయిన సంఘటన వారు వెల్లడించారు.
ఫోటో షూట్ కోసం వారు ఎలాంటి జంతువును ఉపయోగించలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. కాబట్టి దయచేసి నెగిటివిటీని ప్రచారం చేయవద్దు అని వీడియోతో పాటు క్యాప్షన్‌లో స్పష్టం చేశాడు. పోస్ట్ చివరిలో ధన్యవాదాలు కూడా చెప్పారు. అయితే, వీడియోలో ఏం జరిగిందో తెలుసుకుందాం..
నిజానికి కొత్త జంట ఫోటో షూట్ కోసం గుడి లోపలి ప్రాంగణంలోని లొకేషన్‌ను ఎంచుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇంతలో ఈ ఏనుగు కూడా జంట వెనుక నిలబడి కనిపిస్తుంది. ఈ జంట ఫోటోషూట్‌లో ఉండగా, హఠాత్తుగా ఒక ఏనుగు అక్కడ ఉన్న వ్యక్తిపై దాడి చేసింది. అంతేకాదు ఏనుగు ఆ వ్యక్తిని ఎత్తుకుని విసిరేయడమే కాకుండా అతని బట్టలు కూడా లాగేసింది. ఎలాగోలా ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ వీడియోలో ఏనుగుల దాడి దృశ్యం వైరల్‌గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి