Viral: ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు.. ఆ తర్వాత

నాగ్‌పూర్‌లో సోమవారం మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మరణించిన తన 19 ఏళ్ల ప్రియురాలి చితికి దూకడానికి ప్రయత్నించాడు. దీంతో మృతురాలి బంధువులు అతడిని చితకబాదారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో కామలి పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Viral:  ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు.. ఆ తర్వాత
Heartbreaking Love Story

Updated on: Jun 11, 2025 | 8:12 AM

మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. కామలి పోలీసు స్టేషన్‌ పరిధిలో 19 ఏళ్ల యువతి మరణం తీవ్ర కలకలం రేపింది. ప్రియుడితో జరిగిన చిన్న గొడవ కారణంగా ఆ యువతి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. తన ప్రియురాలి మృతితో తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిన యువకుడు అనురాగ్ రాజేంద్ర మేష్రామ్.. ఫుల్‌గా మద్యం సేవించి ఆమె అంత్యక్రియలు చేస్తోన్న కన్హాన్ నది వెంబడి ఉన్న శాంతి ఘాట్ వద్దకు చేరుకున్నాడు. ప్రియురాలి చితిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని అతడు ప్రయత్నించాడు. అయితే అక్కడ ఉన్న మృతురాలి బంధువులు అతన్ని అడ్డగించి చితకబాదారు. ఈ దాడిలో యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.

తీవ్ర గాయాలపాలైన అతడిని ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కన్హాన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు అతడు కోలుకున్న తర్వాత పూర్తి వివరాలను సేకరించనున్నట్టు తెలిపారు. ఈ సంఘటన స్థానికులను ఆందోళనకు గురిచేసింది.

Lovers

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..