Viral Video: అచ్చం మనుషుల్లానే.. బెలూన్‌తో వాలీబాల్‌ ఆడిన శునకాలు.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..

కుక్కలు చాలా తెలివైన జంతువులు. వాటిని విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే చాలామంది వాటిని సొంత కుటుంబ సభ్యుల్లా పెంచుకంటారు. ఈ క్రమంలో మనుషులు చేసే కొన్ని పనులను శునకాలు కూడా అనుసరిస్తుంటాయి.

Viral Video: అచ్చం మనుషుల్లానే.. బెలూన్‌తో వాలీబాల్‌ ఆడిన శునకాలు.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..
Dogs

Updated on: Mar 25, 2022 | 8:20 AM

కుక్కలు చాలా తెలివైన జంతువులు. వాటిని విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే చాలామంది వాటిని సొంత కుటుంబ సభ్యుల్లా పెంచుకంటారు. ఈ క్రమంలో మనుషులు చేసే కొన్ని పనులను శునకాలు కూడా అనుసరిస్తుంటాయి. ఇక ఇటీవల కుక్కలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెటిజన్లు కూడా వీటిని ఆసక్తిగా వీక్షిస్తున్నారు.  అలా తాజాగా కుక్కల ఆటలకు సంబంధించి ఒక వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో స్వయంగా కుక్కలే వాలీబాల్‌ (Volleyball) ఆడుకుంటున్నాయి. అయితే రెగ్యులర్‌ బంతితో కాకుండా బెలూన్‌ (balloon) తో ఆడుతున్నాయి. వాలీబాల్ ప్లేయర్ చేతిలో బంతిని పట్టుకున్నట్లుగా.. ఇక్కడ కుక్కలు గాల్లోకి ఎగురుతూ బెలూన్‌ను తలతో కొడుతుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఈ వీడియోలో తెలుపు, నలుపు, గోధుమ రంగుల్లో చాలా శునకాలను మనం చూడవచ్చు. ఓ గులాబీ కలర్ బెలూల్‌ను గాల్లోకి ఎగరవేయడం, అది కింద పడకుండా గాల్లోకి ఎగిరి మరీ తలతో కొడుతున్నాయి. మనుషులు ఎలాగైతే పోటీపడుతూ వాలీబాల్ ఆడతారో.. అచ్చం ఈ కుక్కలు కూడా ఒకదానికొకటి పోటీపడుతూ గేమ్ ఆడుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘ వీడియో చాలా ఆహ్లాదంగా ఉంది’ ఉందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరికొంత మంది నెటిజన్లు లవ్‌, హార్ట్ ఎమోజీలను పోస్ట్ చేస్తున్నారు.


Also Read:Weekend Special Recipe: మీకు టేస్టీ, స్పైసీ ఫుడ్ తినాలని అనిపిస్తే.. శెనగ పిండితో ఇలా చేయండి..

Mango Farming: మామిడి ప్రియులకు చేదు వార్త.. పండ్ల రారాజును మింగేస్తున్న తామర పురుగు

Pariksha Pe Charcha 2022: ఏప్రిల్ 1న విద్యార్థులతో సంభాషించనున్న ప్రధాని మోడీ.. ఒత్తిడి లేకుండా ఎలా ఉండాలనే విషయంపై సూచనలు

 

Loading...
Unable to load recommendations.
Follow Us