Funny Video: తెల్లవారినా నిద్రలేవనంటున్న శునకం.. రాజభోగం అంటే ఈ కుక్కదే సుమా..!

ఓ కుక్కకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో గది తలుపులు..

Funny Video: తెల్లవారినా నిద్రలేవనంటున్న శునకం.. రాజభోగం అంటే ఈ కుక్కదే సుమా..!
Dog Sleeping

Updated on: Jul 29, 2022 | 8:35 PM

Funny Video: ప్రతిరోజూ వేలాది జంతువుల వీడియోలు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేయబడుతున్నాయి. వాటిలో అనేక వేల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. ఈ వైరల్ కంటెంట్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే.. వినియోగదారుల హృదయాలను గెలుచుకోవడానికి జంతువుల చర్యలు,అమాయకత్వం సరిపోతాయి. వాటిలో అత్యంత వైరల్ అయిన వీడియో కుక్కది. అలాంటి ఓ కుక్కకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో గది తలుపులు తెరుచుకుని లోపలకి వెళ్తే..ఆ గదిలో మంచం కనిపించింది. ఆ మంచం దగ్గరగా వెళ్లి చూస్తే.. అందులో ఒక కుక్క మంచం మీద పడుకుని ఉంది. పైగా తోక ఊపుతూ..హాయిగా పడుకుంది.

ఈ కుక్క..ఓ చిన్న పిల్లాడిలా వెల్లకిలా పడుకుని ఉంది. ముఖం వరకు పింక్‌ కలర్‌ బెడ్‌షీట్‌ కప్పుకుని ఉంది. ఇది చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. శునకం రాజసం మామూలుగా లేదులే అనుకుంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. స్లీపింగ్ డాగ్ యొక్క ఆసక్తికరమైన స్టైల్ వినియోగదారులను చాలా నవ్విస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోకి ఇప్పటివరకు 2 మిలియన్లకు పైగా వీక్షణలు రావడానికి మరియు 67.2k వినియోగదారులు కూడా ఈ వీడియోను ఇష్టపడటానికి కారణం ఇదే. 5 వేల రీట్వీట్‌లతో, కొంతమంది వినియోగదారులు ఈ పోస్ట్‌పై ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us