Viral Video: తోకతో గిటార్‌ వాయిస్తోన్న కుక్క.. మ్యూజిక్‌ బ్యాండ్‌ స్టార్ట్‌ చేద్దామంటోన్న నెటిజన్లు..

|

Mar 21, 2022 | 8:28 AM

విశ్వాసానికి మారుపేరుగా నిలిచే శునకాలను చాలామంది కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటారు. అందుకు తగ్గట్లే అవి కూడా మనుషుల్లాగే ప్రవర్తిస్తుంటాయి.

Viral Video: తోకతో గిటార్‌ వాయిస్తోన్న కుక్క.. మ్యూజిక్‌ బ్యాండ్‌ స్టార్ట్‌ చేద్దామంటోన్న నెటిజన్లు..
Follow us on

విశ్వాసానికి మారుపేరుగా నిలిచే శునకాలను చాలామంది కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటారు. అందుకు తగ్గట్లే అవి కూడా మనుషుల్లాగే ప్రవర్తిస్తుంటాయి. మనం చేసే చాలా పనులను సులభంగా చేస్తుంటాయి. అందుకే వివిధ నేర పరిశోధనలు, నిందితుల గుర్తింపులో కుక్కలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అలా కుక్కకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. సాధారణంగా గిటార్ (Guitar) వాయించాలంటే ఎంతో నైపుణ్యం, అనుభవం ఉండాలి. అందుకే చాలామంది గిటార్‌ నేర్చుకునేందుకు కోర్సులు కూడా చేస్తుంటారు. అలాంటిది ఒక కుక్క గిటార్‌ వాయించింది. తన తోకనూ అటూ ఇటూ ఊపుతూ గిటార్‌ను ప్లే చేసింది.

ఈ వీడియోను డాగ్ అనే ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్‌ చేశారు. దీనికి ‘ఎవరైనా ఏదైనా సాధించ‌గ‌ల‌రు. దీనికి ఈ వీడియోనే నిదర్శనం’ అని క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే వాస్తవానికి.. ఆ కుక్క కావాల‌ని గిటార్ ను వాయించ‌లేదు. త‌న వెనుక గిటార్ ఉండ‌డం అదే సమయంలో తోక‌ను ఊప‌గా అది గిటార్ తీగ‌ల‌కు త‌గిలింది. దీంతో మ్యూజిక్ బ‌య‌టికి వ‌చ్చింది. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘కుక్క బాగా గిటార్‌ వాయిస్తోంది. మ్యూజిక్‌ చాలా బాగుంది’, ‘ఈ శునకంతో కొత్తగా మ్యూజిక్‌ బ్యాండ్‌ ప్రారంభించవ్చు’ అని ఫన్నీ కామెంట్లు కురిపిస్తున్నారు. మరి నెటిజన్లను ఆకట్టుకుంటోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Also Read: India-Australia Summit: భారత్ లో ఆస్ట్రేలియా పెట్టుబడులు.. నేడు ఇరు దేశ ప్రధానుల మధ్య మీటింగ్..

Morning: మార్నింగ్‌ లేవగానే ఈ పనులు చేయండి.. హుషారుగా ఉంటారు..!

Brain Tunnels: మెదడులో ‘రహస్య సొరంగాలు’.. పరిశోధనల ద్వారా గుర్తించిన శాస్త్రవేత్తలు