పొలాల్లో ‘ నకిలీ పులులు ‘.. రైతుల భలే ఐడియా

| Edited By: Srinu

Dec 03, 2019 | 4:50 PM

కర్ణాటకలో రైతులు తమ పొలాలను కోతులబారి నుంచి రక్షించుకునేందుకు భలే ఐడియా వేశారు. ముఖ్యంగా శివగంగ జిల్లాలోని గ్రామాల రైతులు మంకీల బెడదను అరికట్టడానికి తమ పెంపుడు కుక్కలకే పులుల్లా .. పసుపు చారలను వాటి ఒంటిపై పెయింటింగ్ వేసి వదులుతున్నారట.. దీంతో అవి నిజంగా పులులేనని భయపడి కోతులు ఆ ఆ ఛాయలకే రావడం మానేశాయని వాళ్ళు ఆనందంతో చెబుతున్నారు. గతంలో తాను గోవా నుంచి పులి బొమ్మలను తెఛ్చి వాటిని తన పొలంలో పెట్టేవాడినని. […]

పొలాల్లో  నకిలీ పులులు .. రైతుల భలే ఐడియా
Follow us on

కర్ణాటకలో రైతులు తమ పొలాలను కోతులబారి నుంచి రక్షించుకునేందుకు భలే ఐడియా వేశారు. ముఖ్యంగా శివగంగ జిల్లాలోని గ్రామాల రైతులు మంకీల బెడదను అరికట్టడానికి తమ పెంపుడు కుక్కలకే పులుల్లా .. పసుపు చారలను వాటి ఒంటిపై పెయింటింగ్ వేసి వదులుతున్నారట.. దీంతో అవి నిజంగా పులులేనని భయపడి కోతులు ఆ ఆ ఛాయలకే రావడం మానేశాయని వాళ్ళు ఆనందంతో చెబుతున్నారు.

గతంలో తాను గోవా నుంచి పులి బొమ్మలను తెఛ్చి వాటిని తన పొలంలో పెట్టేవాడినని. మొదట్లో వానరాలు అవి చూసి భయపడినా.. ఆ తరువాత ఎండా, వానలకు ఆ బొమ్మలమీది రంగులు కరిగిపోయి.. వాటి అసలు ‘రూపం ‘ బయటపడడంతో కోతులు మళ్ళీ ‘ పొలాల మీద పడడం ప్రారంభించాయని ఓ రైతు తెలిపాడు. ఇక అలా లాభం లేదని ఈ సరికొత్త ‘ ప్రయోగానికి ‘ శ్రీకారం చుట్టానని అంటున్నాడు. తనను చూసి ఇతర రైతులు కూడా తమ కుక్కలను నకిలీ ‘ పులులు ‘ గా మార్చి వారి పొలాల పైకి వదులుతున్నారని గర్వంగా పేర్కొన్నాడు. .