శునకాలు (Dogs) అంటే మనందరికీ చాలా ఇష్టం. వాటిని ఇంట్లో పెంచుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతారు. ప్రపంచంలో కుక్కలంటే అమితమైన ప్రేమ ఉన్నవాళ్లు అధిక సంఖ్యలోనే ఉన్నారు. ఇంటి భద్రత కోసమే కాకుండా, ఇంట్లో మనుషుల్లా ట్రీట్ చేస్తుంటారు. కాగా.. అవి చేసే పనులు కొన్ని సార్లు విసుగు, మరికొన్ని సార్లు ఆనందం కలిగిస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావంతో అలాంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్ (Viral) అవుతోంది. ఈ వీడియోలో ఓ చిన్న కుక్క.. పింక్ టవల్ మెడకు కట్టుకుని డ్యాన్స్ చేస్తుంది. కెమెరాను చూపించగానే అది అద్భుతంగా డ్యాన్స్ చేసింది. అచ్చం మనిషి లాగే రెండు కాళ్లపై నిలబడింది. ఈ వీడియో సోషల్ మీడియా యాప్ Instagram ద్వారా పోస్ట్ అయింది. ఇప్పటివరకు ఈ వీడియోను నాలుగు లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ కుక్క నిజంగా అందమైనదని, ఇది నేను చూసిన అత్యుత్తమ విషయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతే కాకుండా చాలా మంది యూజర్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. .. ఇంకేందుకు ఆలస్యం ఈ వీడియోను మీరూ చూసేయండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..