
స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా వినియోగం పెరిగిపోవడంతో ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా అందరికీ ఇట్టే ఇట్టే చేరిపోతోంది. సాధారణంగా వింతలు, మనుషులను తీవ్ర ప్రభావం చేసే సంఘటనలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగిని వైద్యుడు చితకబాదడం ఆ వీడియోలో కనిపిస్తోంది.
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం షిమ్లాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ వైద్యుడు రోగిపై దాడి చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. ఆస్పత్రి బెడ్‌పై పడుకున్న రోగిపై ఓ వైద్యుడు చేయి చేసుకున్నాడు. దీంతో ఆ రోగి కూడా వైద్యుడిని తన్నడం మొదలు పెట్టాడు. దీంతో తీవ్ర కోపోద్రుక్తుడైన వైద్యుడు.. మరింతగా రెచ్చిపోయి దాడి చేశాడు. కొందరు ఆపేందుకు ప్రయత్నించినా వైద్యుడు రోగిని చితకబాదాడు. ఈ వీడియో అక్కడున్నవారు వీడియో తీసి నెట్‌లో పెట్టడంతో వైరల్ అయ్యింది.
Doctor thrashing a patient in IGMC Shimla.
— International Relations (@Intl_Relations0) December 22, 2025
దీంతో వైద్యుడిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోగుల పట్ల వైద్యుడి ప్రవర్తన సరిగా లేదని, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు అతనిపై చర్యలు తీసుకున్నారు. అతడ్ని సస్పెండ్ చేశారు. దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తాను గౌరవంగా మాట్లాడమని చెప్పినందుకే ఆగ్రహించిన వైద్యుడు తనపై తీవ్రంగా దాడి చేసి గాయపర్చాడని బాధిత రోగి వాపోయాడు.