
సాధారణంగా పాము పేరు వింటేనే అందరికీ భయం వేస్తుంది. ఎంతటి బలమైన జంతువైనా పామును ఎదుర్కోవడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంది. కానీ, ఒంటె మాత్రం విషపూరితమైన పాములను బతికుండగానే తినేస్తుంది. వాస్తవానికి ఒంటెలు ఆకులు, పండ్లు, కూరగాయలు తినే శాకాహారులు. పాములను తినడం వాటి ఆహార అలవాటు కాదు. కానీ, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మనుషులే వాటికి బలవంతంగా పాములను తినిపిస్తారు.
ఒంటెలకు పాములను ఎందుకు తినిపిస్తారు?
ఒంటెలకు హియామ్ అనే ఒక వింత వ్యాధి సోకినప్పుడు అవి పాములను తినాల్సి వస్తుంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు ఒంటెలు నీరు తాగడం, ఆహారం తీసుకోవడం పూర్తిగా మానేస్తాయి. పశ్చిమ ఆసియా దేశాలలో ఒక నమ్మకం ఉంది.. ఈ వ్యాధితో బాధపడుతున్న ఒంటెకు విషపూరితమైన పామును తినిపిస్తే అది త్వరగా కోలుకుంటుందని వారు నమ్ముతారు.
ఒంటెకు పామును ఎలా తినిపిస్తారు
ఒంటె నోరు తెరిచి, దాని లోపలికి పామును నెట్టి, అది లోపలికి వెళ్లడానికి వీలుగా నీటిని పోస్తారు. పాము విషం ఒంటె శరీరంలోకి చేరినప్పుడు, ఆ విషం ప్రభావంతో వ్యాధి తగ్గుతుందని స్థానికుల నమ్మకం. విషం ప్రభావం క్రమంగా తగ్గుతున్న కొద్దీ ఒంటె తిరిగి మామూలు స్థితికి వస్తుంది.
పాములతో జాగ్రత్త
మనుషులకు పాము కరిచినప్పుడు సరైన సమయంలో చికిత్స అందకపోతే ప్రాణాపాయం తప్పదు. అయితే, పాములు అనవసరంగా ఎవరినీ కరవవు. అవి తమను తాము రక్షించుకోవడానికి లేదా మనుషుల వల్ల ఏదైనా హాని జరుగుతుందని భయపడినప్పుడు మాత్రమే ఎదురుదాడి చేస్తాయి. చాలా సందర్భాలలో భయం కారణంగానే పాములు మనుషులపై దాడి చేస్తుంటాయి. కాబట్టి పాముల జోలికి మీరు ఎప్పుడూ వెళ్లకండి అవి కూడా మీ జోలికి రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్, నివేదికల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని TV9 దృవీరరించడం లేదు.
మరిన్ని ట్రెంగింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.