Watch Viral Video: ఏం టాలెంట్ రా బాబూ..! బైక్‌కి ట్రాక్టర్ టైర్ బిగించి బలాదూర్.. ఈ ఐడియా ఇంకేవరికీ రాదులే..!

|

Aug 28, 2023 | 9:44 AM

అయితే, గతంలో కూడా ఇలాంటి వినూత్న వాహనాలు అనేకం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. ఇందులో ఓ వ్యక్తి బైక్ కు వెనకాల సిటింగ్ ప్లేస్ ఏర్పాటు చేశాడు. దాంతో ఆ తనతో పాటు ముగ్గురు మహిళలు, ఐదుగురు చిన్నారులను కూర్చోబెట్టుకున్నాడు.  ఇలా మొత్తం తొమ్మిది మంది ఎక్కారు. ఇది బైక్ కాదు చిన్నపాటి రిక్షాని తలపించింది. 

Watch Viral Video: ఏం టాలెంట్ రా బాబూ..! బైక్‌కి ట్రాక్టర్ టైర్ బిగించి బలాదూర్.. ఈ ఐడియా ఇంకేవరికీ రాదులే..!
Bike Attached With Tractor
Follow us on

స్వదేశీ జుగాద్‌ను విస్తృతం చేస్తే.. ప్రజలు ఊహించలేని వాటిని తయారు చేస్తారు. ఈ విషయం మేం చెప్పడం లేదు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం. ఇందులో ఇద్దరు కుర్రాళ్లు జుగాడ్‌తో తయారు చేసిన బైక్‌పై హ్యాపీగా వెళుతున్నారు. జుగాడ్ ప్రపంచంలో భారతీయులకు పోటీ లేదు. ఇలాంటి వీడియోలతో సోషల్ మీడియా నిండిపోయింది. ఎంతటి క్లిష్టమైన పనిని కూడా మన జుగాడ్‌ తలచుకుంటే.. చిటికెలో చేసే సత్తా ఉంది. అందుకోసం అవసరమైన ఏ చిన్న వస్తువును కూడా విడిచిపెట్టరు.. పనికి రాని పాత వస్తువులతో కూడా అద్భుతాలు సృష్టిస్తుంటారు. తక్కువ వనరులతో ఎలా పని చేయాలో భారతీయుడి కంటే ఎవరూ బాగా అర్థం చేసుకోలేరు. దీనికి సంబంధించిన మరో వినూత్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇది ప్రతి ఒక్కరి మనస్సును ఆకర్షిస్తోంది.

ఈ క్లిప్‌ను Instagramలో (@pb13_sangrur_walle) అనే ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. వైరల్‌ వీడియోలో ఓ అబ్బాయి భారీ టైర్‌పై కూర్చుని ప్రయాణిస్తున్నాడు.. దాని వెనకాలే చూస్తే.. బైక్‌పై కూర్చున్న మరో బాలుడు కనిపించాడు. కానీ, ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే భారీ టైర్‌కు బైక్‌ను అటాచ్‌ చేసి ఉంది. కెమెరా యాంగిల్‌ని మార్చి చూస్తే తెలుస్తుంది..బైక్‌కు ముందు టైర్‌ లేదని, దానికి ట్రాక్టర్ వీల్‌ను అమర్చినట్లు అర్థమవుతోంది. ట్రాక్టర్‌ టైర్ కు పొడవాటి ఇనుప రాడ్‌తో బైక్‌కు బిగించారు. అలాగే టైరు పైన కూర్చునేందుకు ప్లేట్ కూడా అమర్చారు. ఈ జుగాడు వాహనానికి సాటి లేదు. ఈ ఇద్దరు కుర్రాళ్లు దానితో ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు.

అయితే, గతంలో కూడా ఇలాంటి వినూత్న వాహనాలు అనేకం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. ఇందులో ఓ వ్యక్తి బైక్ కు వెనకాల సిటింగ్ ప్లేస్ ఏర్పాటు చేశాడు. దాంతో ఆ తనతో పాటు ముగ్గురు మహిళలు, ఐదుగురు చిన్నారులను కూర్చోబెట్టుకున్నాడు.  ఇలా మొత్తం తొమ్మిది మంది ఎక్కారు. ఇది బైక్ కాదు చిన్నపాటి రిక్షాని తలపించింది.

అయితే, జుగాద్ నుండి ఇటువంటి డిజైన్‌తో వాహనాన్ని రూపొందించడం ఇది మొదటిసారి కాదు. దీనికి ముందు అనేక రకాలైన వాహనాలు దర్శనమిచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..