Sugarcane Juice: మనుషులకు ఈ మధ్య అతి తెలివి ఎక్కువ అయ్యింది.శృతి మించిన ఆలోచనలు చేస్తూ చూసే జనాలకు పిచ్చేక్కిస్తున్నారు. భారతీయుల్లోనూ అద్భుతమైన ప్రతిభ దాగి ఉంది. అది అప్పుడప్పుడు బయటకు వస్తుంటుంది. అలాంటి టైమ్లో దానిని చూసి ప్రజలు కూడా ఆశ్చర్యపడుతుంటారు. ముఖ్యంగా జుగాడ్ విషయంలో భారతీయులను ఎవరూ అణచివేయలేరు. మన దేశంలోని కొందరు క్రియేటర్స్ కార్లు మొదలుకొని హెలికాప్టర్ల వరకూ అన్నింటినీ తయారు చేసేస్తుంటారు..అందులో కొన్ని సక్సెస్ అయితే, మరి కొన్ని మాత్రం జనాలను విపరీతంగా నవ్విస్తున్నాయి…
భారతదేశంలోని ప్రజలు సాధారణంగా వ్యవసాయంపై ఎక్కువ శ్రద్ధ చూపినప్పటికీ, అటువంటి పరిస్థితిల్లో సాగుబడికి సంబంధించిన వాటిపై ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. కొన్నిసార్లు రైతులు పొలాల నుండి పక్షులను తరిమికొట్టడానికి కొన్ని ప్రత్యేకమైన టెక్నిక్స్ని వాడుతుంటారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి చెరుకు రసాన్ని తీసెందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు.దాన్ని చూసిన వారంతా నోర్లు వెల్లబెడుతున్నారు.అతని వింత ఐడియాకు సంభందించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
మీరు చెరకు రసం తాగే ఉంటారు. రోజుల్లో ప్రతి గ్రామంలో కూడా యంత్రాల ద్వారా తీసిన చెరుకు రసం అందుబాటులో ఉంటుంది..అయితే, ఇక్కడ ఓ వ్యక్తి బైక్ సాయంతో చెరుకు రసం తీయడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. బైక్కు పొడవాటి కర్రను కట్టి, దానితో అతను గుండ్రంగా తిరుగుతుండగా, మధ్యలో ఒక యంత్రం నుండి చెరకు రసం తీయడాన్ని వీడియోలో చూడవచ్చు.
Innovative way to extract sugarcane juice??? pic.twitter.com/imqvRr7MNJ
— RANDOM FACTS (@RANDOMFACTS2022) June 16, 2022
ఈ వీడియో ఎంతో ఫన్నీగా ఉంది. దీనిని చూసినవారంతా ఫన్నీగా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన కొన్ని నిమిషాలకే లక్షల్లో వ్యూస్ వచ్చాయి.