సప్నా చౌదరి పాటకు మహిళా పోలీసుల డ్యాన్స్.. వీడియో వైరల్

ఎప్పుడూ డ్యూటీలో బిజీగా ఉండే ఈ మహిళా పోలీసులు తమలో ఉన్న డ్యాన్స్ ప్రతిభను బయటకు తీశారు. ఓ హర్యానీ హిట్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మహిళా పోలీసుల డ్యాన్స్‌కు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. గత నెల 30న సౌత్ వెస్ట్ ఢిల్లీ పోలీసులు ‘సునో సహెలీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా ప్రముఖ హర్యానీ సింగర్ […]

సప్నా చౌదరి పాటకు మహిళా పోలీసుల డ్యాన్స్.. వీడియో వైరల్
Follow us

| Edited By:

Updated on: Apr 02, 2019 | 7:00 PM

ఎప్పుడూ డ్యూటీలో బిజీగా ఉండే ఈ మహిళా పోలీసులు తమలో ఉన్న డ్యాన్స్ ప్రతిభను బయటకు తీశారు. ఓ హర్యానీ హిట్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మహిళా పోలీసుల డ్యాన్స్‌కు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.

గత నెల 30న సౌత్ వెస్ట్ ఢిల్లీ పోలీసులు ‘సునో సహెలీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా ప్రముఖ హర్యానీ సింగర్ సప్నా చౌదరి హిట్ పాట ‘తేరి ఆఖోంకా ఏ కాజల్’ అనే పాటను ప్లే చేశారు. దానికి కొంతమంది మహిళా పోలీసులు స్టేజీ మీదకు ఎక్కి డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. అంతటితో ఊరుకోక ఐపీఎస్ అధికారిణి బెనిటా మారి జైకర్‌ను కూడా వారు స్టేజీ మీదకు లాగారు. దానిని స్పోర్టివ్‌గా తీసుకున్న బెనిటా.. వారితో కలిసి స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.