Viral: అక్కో.. ఏటయింది మీకు.. అక్కడ సీట్లు అన్నీ ఖాళీగానే ఉన్నాయ్‌గా..

ఏమయిందో తెలీదు.. మెట్రోలో సీట్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయ్... కానీ ఈ ఇద్దరు అక్కలు మాత్రం WWEలో కొట్టుకున్నట్లు కుస్తీ పోటీగా దిగారు. ఎవ్వరూ తగ్గనంటున్నారు. పక్కనవాళ్లు గొడవను ఆపే ప్రయత్నం చేసినా వినలేదు. అసలు గొడవ ఎందుకు మొదలైందో తెలిక చాలామంది జుట్టు పీక్కున్నారు.

Viral: అక్కో.. ఏటయింది మీకు.. అక్కడ సీట్లు అన్నీ ఖాళీగానే ఉన్నాయ్‌గా..
Women Fighting

Updated on: Sep 29, 2025 | 5:49 PM

ఢిల్లీ మెట్రో లోపలి నుంచి వచ్చిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఢిల్లీలో ఎక్కువ మంది వినియోగించే మెట్రో రైళ్ల నుంచి.. రకరకాల రీల్స్‌ షూట్ చేస్తున్న వీడియోలు, లవర్స్ రెచ్చిపోతున్న వీడియోలు, సీట్ల కోసం గొడవపడుతున్న వీడియోలు అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి. ఈసారి ఖాళీగా ఉన్న రైలు కోచ్‌లో ఇద్దరు మహిళలు ఫైట్ చేస్తూ కనిపించారు.

మొదట్లో వారి మధ్య చిన్న వాగ్వాదం తలెల్తినట్లు అనిపించింది. ఆ తర్వాత ఇద్దరు ఒకరి కొప్పు మరొకరు పట్టుకుని ఫైట్‌కు దిగారు.  వీడియోలో, మహిళలు ఒకరినొకరు కొట్టుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది. వారిలో ఒకరు మరొకరిని సీటుకు అదిమిపట్టి.. ఆమె జుట్టును చాలా బలంగా లాగుతున్నారు. క్లిప్‌లో ఈ పోరాటం కొన్ని సెకన్లు మాత్రమే ఉంది. అయినప్పటికీ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. 

సీటుపై కూర్చున్న మహిళ.. తనపై దాడి చేస్తున్న మహిళను దూరంగా నెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. మహిళ దాడి చేస్తూనే ఉండగా ఆమె తనను తాను రక్షించుకోవడానికి తన చేతులు, కాళ్లు ఉపయోగిస్తుంది. అదే కోచ్‌లోని ఇతర ప్రయాణీకులు షాక్‌తో వీరి గొడవను చూస్తున్నారు. మధ్యలో వెళ్తే తమకు అపాయం అనుకున్నారో ఏమో అలా నిమ్మకుండిపోయారు. చివరకు ఒక మహిళ గొడవను ఆపడానికి ప్రయత్నించింది కానీ ఫలించలేదు.  రైలు ఒక స్టేషన్‌కు చేరుకుని తలుపులు తెరుచుకున్నప్పుడు.. ఒకరు ఆ గొడవ చూసి భయపడుతూ బయటకు వెళ్లిపోతున్నట్లుగా ఉంది.

గొడవ ఎందుకు మొదలైందో ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. కొంతమంది అది సీటు గురించి అయి ఉండవచ్చని అంటున్నారు. తమాషా ఏమిటంటే కోచ్ దాదాపు ఖాళీగా ఉంది. వారు గొడవ పడుతున్న వరుస కూడా ఖాళీగానే ఉంది.