Viral Video: తగ్గేదేలే.! వేటాడబోయిన మొసలి.. దిమ్మతిరిగే షాకిచ్చిన సింహం..

అడవిలో నియమాలు చాలా భిన్నంగా ఉంటాయి. అక్కడ బ్రతకాలంటే తెగువుండాల్సిందే. ఎందుకంటే అక్కడ ఆహారం కోసం తరచూ వేట కొనసాగుతుంది...

Viral Video: తగ్గేదేలే.! వేటాడబోయిన మొసలి.. దిమ్మతిరిగే షాకిచ్చిన సింహం..
Lion

Updated on: Feb 14, 2022 | 1:16 PM

అడవిలో నియమాలు చాలా భిన్నంగా ఉంటాయి. అక్కడ బ్రతకాలంటే తెగువుండాల్సిందే. ఎందుకంటే అక్కడ ఆహారం కోసం తరచూ వేట కొనసాగుతుంది. ఎప్పుడు ఏ జంతువు వచ్చి తినేస్తుందేమోననే భయంతో బ్రతకాల్సి ఉంటుంది. సాధారణంగా క్రూర జంతువులు వేట భయంకరంగా ఉంటుంది. సింహం, పులి, చిరుత, మొసలి.. వీటి వేటకు సంబంధించిన వీడియోలను మీరు తరచూ సోషల్ మీడియాలో చూసే ఉంటారు. అయితే రెండు బలశాలి జంతువులు ఒకదానితో ఒకటి తలబడితే ఎలా ఉంటుంది.? రచ్చ.. రచ్చే అని చెప్పాలి. సరిగ్గా దీనికి అడ్డంపట్టే విధంగా తాజాగా ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది పాత వీడియో అయినప్పటికీ మరోసారి వైరల్‌గా మారింది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ సింహం నదిని దాటుతున్నట్లు మీరు చూడవచ్చు. ఇక అది దాటడం చూసిన మొసలి.. వేటాడేందుకు వేగంగా ఈదుకుంటూ సింహం వైపుకు వస్తుంది. తన పదునైన దవడలతో సింహాన్ని పట్టుకుంటుంది. అయితే ముంచుకొచ్చిన ప్రమాదాన్ని ముందే గమనించిన సింహం.. చాకచక్యంగా మొసలి నుంచి తప్పించుకుంటుంది. ఎగురుకుంటూ.. ఎగురుకుంటూ.. నదిని దాటేస్తుంది. ఇది దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్‌ పార్క్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us