Viral: మొసలికి కోపమొస్తే ఇంతేనేమో.! ఆటపట్టించిన వ్యక్తిని చెడుగుడు ఆడుకుంది.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.!

|

Nov 17, 2021 | 9:47 PM

సముద్రపు అలెగ్జాండర్ అని పిలువబడే మొసలి నోట ఏ జంతువు చిక్కినా తప్పించుకోవడం కష్టం. దాని దవడలు చాలా బలమైనవి.

Viral: మొసలికి కోపమొస్తే ఇంతేనేమో.! ఆటపట్టించిన వ్యక్తిని చెడుగుడు ఆడుకుంది.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.!
Follow us on

సముద్రపు అలెగ్జాండర్ అని పిలువబడే మొసలి నోట ఏ జంతువు చిక్కినా తప్పించుకోవడం కష్టం. దాని దవడలు చాలా బలమైనవి. క్షణాల్లో తన ఎరను మట్టుబెట్టేస్తుంది. నీటిలో ఉన్నా.. లేకపోయినా.. మొసలికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుందని పెద్దలు అంటుంటారు. మనం అది మిగతా జంతువులను వేటాడే వీడియోలను తరచూ సోషల్ మీడియాలో చూస్తేనే ఉంటాం. అలాంటిది అంతటి బలశాలి అయినా మొసలితో ఎవరైనా గేమ్స్ ఆడాలని అనుకుంటారా.? ఇదేం క్వశ్చన్.! ఎవరూ చేయరు అని అంటారు కదూ.! కానీ ఇక్కడొక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా మొసలితో గేమ్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. దీని తర్వాత అసలు ఏం జరిగిందో చూస్తే మీరూ ఆశ్చర్యపోతారు.

వైరల్ వీడియో ప్రకారం.. నది ఒడ్డున సేద తీరుతున్న మొసలిని ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే తట్టి లేపుతాడు. దాని నుంచి దూరంగా పారిపోవాల్సింది పోయి.. ఆటపట్టించడం మొదలుపెడతాడు. అంతే క్షణాల్లో సీన్ రివర్స్ అయింది. మొసలికి కోపం వచ్చింది.. తనతో పదునైన దవడలతో అతడి చెయ్యి పట్టుకుని కొరికింది. కొద్ది నిమిషాల పోరాటం అనంతరం ఆ వ్యక్తి తన చేతిని ఎలాగోలా రక్షించుకోగలిగాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా, ఈ షాకింగ్ వీడియోను ‘Nature27_12’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. ఇప్పటిదాకా ఈ వీడియో 45 వేల కంటే ఎక్కువ వ్యూస్ సంపాదించింది. చాలామంది ఈ వీడియోను ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న సదరు వ్యక్తిపై మండిపడుతున్నారు. అదే సమయంలో కొంతమంది అయితే ఈ వీడియోపై ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘క్రూర జంతువులతో ఆటలు ఆడకూడదు’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘ఆ వ్యక్తికి గుణపాఠం వచ్చి ఉంటుంది’ అని వేరొకరు కామెంట్ చేశారు. ‘ఈ వ్యక్తి చాలా అదృష్టవంతుడు.. తృటిలో ప్రాణాలు రక్షించుకున్నాడు’ అని మరొకరు కామెంట్ చేశారు.