ఛీ.. ఛీ.. వీళ్లిద్దరూ కరువు దేశం నుంచి వచ్చినట్లున్నారు.. ఏకంగా మెట్రోలోనే రెచ్చిపోయారు.. కట్ చేస్తే..

ఇటీవల కాలంలో కొందరు రెచ్చిపోతున్నారు. చుట్టూ జనం ఉన్నా ఆపుకోలేక బరితెగిస్తున్నారు.. ఇందుకు ఉదాహరణ ఇటీవల ఢిల్లీ మెట్రోలో జరిగిన కొన్ని సంఘటనలు.. మెట్రో అంతమంది జనం ఉన్నా.. కొందరు యువతీ యువకులు ముద్దులు పెట్టుకుంటూ కనిపించారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడంతో ..

ఛీ.. ఛీ.. వీళ్లిద్దరూ కరువు దేశం నుంచి వచ్చినట్లున్నారు.. ఏకంగా మెట్రోలోనే రెచ్చిపోయారు.. కట్ చేస్తే..
Viral Video

Updated on: May 07, 2024 | 5:31 PM

ఇటీవల కాలంలో కొందరు రెచ్చిపోతున్నారు. చుట్టూ జనం ఉన్నా ఆపుకోలేక బరితెగిస్తున్నారు.. ఇందుకు ఉదాహరణ ఇటీవల ఢిల్లీ మెట్రోలో జరిగిన కొన్ని సంఘటనలు.. మెట్రో అంతమంది జనం ఉన్నా.. కొందరు యువతీ యువకులు ముద్దులు పెట్టుకుంటూ కనిపించారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడంతో మెట్రో యాజమాన్యం సైతం అలాంటి వారిపై చర్యలు తీసుకుంది.. అప్పట్లో నెట్టింట ఈ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి…అవే అనుకుంటే.. తాజాగా.. బెంగళూరు మెట్రోలో జరిగిన ఓ ఘటన సంచలనంగా మారింది. బెంగళూరు మెట్రోలో ఒక జంట ముద్దులు పెట్టుకున్నట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది.

బెంగుళూరు మెట్రోలో యువతి యువకుడు ఇద్దరూ ముద్దు పెట్టుకుంటూ కనిపించారని.. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియోను సహ-ప్రయాణికుడు రికార్డు చేశాడు.. అనంతరం ఈ విషయాన్ని చెబుతూ ఇంటర్నెట్‌లో పంచుకున్నాడు. అంతేకాకుండా.. అసభ్యకరంగా ప్రవర్తించిన ఈ జంటపై చర్యలు తీసుకోవాలని బెంగుళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL)ని కూడా వినియోగదారుడు డిమాండ్ చేశాడు.

వీడియో చూడండి..

దీనికి సంబంధించిన వీడియో ‘Sam459om’ హ్యాండిల్ ద్వారా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (గతంలో ట్విట్టర్)లో భాగస్వామ్యం చేశారు. దీన్ని బెంగళూరు మెట్రోతోపాటు.. బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేసి.. మన మెట్రోలో ఏం జరుగుతోంది? మెల్లమెల్లగా బెంగళూరు మెట్రో ఢిల్లీ మెట్రోగా మారుతోంది. వారిపై కొన్ని చర్యలు తీసుకోండి. ఓ అమ్మాయి అబ్బాయిని ముద్దు పెట్టుకుంది. అంటూ పోస్ట్ చేశారు. క్లిప్ వైరల్ కావడంతో, బెంగళూరు పోలీసులు కూడా దీనిపై స్పందిస్తూ, “గమనించాను, దయచేసి మీ నంబర్‌ను DM ద్వారా అందించండి” అని రాశారు.

ఈ వీడియో పోస్ట్ చేయడమే ఆలస్యం.. నెట్టింట తెగ వైరల్ అయ్యింది.. ఢిల్లీ మెట్రోతో పోల్చితే.. ఇక్కడ నయమేనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ ఎటువంటి తప్పు జరగలేదని కొందరు కామెంట్లు చేస్తుండగా.. అలాంటి ప్రవర్తనను క్షమించవద్దంటూ కోరుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..