Viral video: కుక్కకు సుస్సు పోయించిన కోడి.. చివరిలో ఊహించని ట్విస్ట్

|

Feb 27, 2023 | 6:30 PM

తాజాగా వైరల్ అవుతోన్న నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Viral video: కుక్కకు సుస్సు పోయించిన కోడి.. చివరిలో ఊహించని ట్విస్ట్
Cock And Dog Fight
Follow us on

జంతువుల మధ్య వైరం ఉండటం సహజమే.. బలమైన జంతువులు చిన్న జంతువుల పై దాడి చేయడం మనం చూస్తూనే ఉంటాం.. కానీ కొన్నిసార్లు చిన్న జంతువులు పెద్ద వాటి పై తిరగబడటం కూడా జరుగుతోంది. ఇక జంతువులకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా వైరల్ అవుతోన్న నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కుక్కలు మాములుగా కోడిని చూస్తే లటుక్కున్న పట్టుకొని కనిపించకుండా పారిపోతాయి. కోడిని వేటాడి చంపుతుంటాయి కుక్కలు. కుక్క కోడి కొట్టుకుంటే కుక్కే గెలుస్తుంది. కానీ తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది.

కోడి, కుక్క మధ్య జరిగిన భీకర పోరుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. సోషల్ మీడియాలో ఈ వీడియోకు పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. కోడి సాహసాన్ని సోషల్ మీడియా అభిమానులు కొనియాడుతున్నారు. ఒక కోడి తన పై దాడి చేయడానికి వచ్చిన కుక్కను ఎదిరించింది. ఎగిరి ఎగిరి కుక్క పై దాడి చేసింది.

కుక్క వెనక్కి తగ్గిన కోడి మాత్రం వెనకడుగువేయలేదు. ఇక చేసేదేమి లేక ఆ కుక్క అక్కిడి నుంచి పారిపోయింది. అయినా కూడా కోడి దాన్ని తరిమింది. ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ జంతువు_లవర్_వాగాడ్ షేర్ చేసింది,  ఈ వీడియోకు ఇప్పటి వరకు చాలా కామెంట్స్ అలాగే  68.6 k లైక్‌లు వచ్చాయి.