
నవి ముంబైలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నిలిపిన సైకిల్‌లో దాక్కున్న నాగుపాము పిల్ల ఒక మహిళను కాటేసింది. ఖారఘర్ ప్రాంతంలో పనుల కోసం వెళ్లిన మహిళ సైకిల్‌ను తాకగా, చైన్ రేకు దగ్గర దాగి ఉన్న చిన్న కోబ్రా పాము కాటేసింది. దీంతో ఆమె వెంటనే కేకలు వేసింది. దీంతో స్థానికులు బాధితురాలిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ సమయానికి చికిత్స అందడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆరోగ్యం మెరుగుపడుతోంది.
ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. రోడ్డు పక్కన లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలిపిన వాహనాలను ఉపయోగించే ముందు తప్పనిసరిగా జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు.
వీడియో దిగువన చూడండి…