కండోమ్స్ కోసం లక్షలా.. ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్.. పైగా మన పక్క రాష్ట్రంలోనే..

ఆన్‌లైన్ షాపింగ్ అంటే కేవలం కూరగాయలు, నిత్యావసరాలే అనుకుంటే పొరపాటే.. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ తాజాగా విడుదల చేసిన 2025 రిపోర్ట్ చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ముఖ్యంగా చెన్నైకి చెందిన ఒక వ్యక్తి ఏకంగా లక్ష రూపాయలకు పైగా బిల్లు దేని కోసం చేశాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు.

కండోమ్స్ కోసం లక్షలా.. ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్.. పైగా మన పక్క రాష్ట్రంలోనే..
Man Spends Rs 1.06 Lakh On Condoms

Updated on: Dec 25, 2025 | 6:35 PM

నేటి డిజిటల్ యుగంలో ఉప్పు, పప్పు నుంచి అత్యవసర మందుల వరకు అన్నీ ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ ఇస్తున్నాం. నిమిషాల్లో డెలివరీ చేసే బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి యాప్స్ మన జీవనశైలిలో భాగమైపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ విడుదల చేసిన 2025 వార్షిక నివేదికలో ఒక విచిత్రమైన విషయం వెలుగులోకి వచ్చింది. చెన్నైకి చెందిన ఒక వ్యక్తి కేవలం కండోమ్‌ల కోసమే ఏడాది పొడవునా లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఏడాదికి 228 ఆర్డర్లు..

ఇన్‌స్టామార్ట్ గణాంకాల ప్రకారం.. చెన్నైకి చెందిన సదరు వ్యక్తి 2024-25 ఏడాదిలో కండోమ్స్ ఆర్డర్ల కోసం ఏకంగా రూ.1,06,398 ఖర్చు చేశాడు. అతను ఏడాది పొడవునా మొత్తం 228 సార్లు వీటి కోసం ఆర్డర్లు ఇచ్చాడు. అంటే సగటున నెలకు 19 సార్లు లేదా దాదాపు ప్రతి రెండు రోజులకు ఒకసారి ఆర్డర్ చేశాడన్నమాట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న భరద్వాజ్ రంగన్ పోస్ట్

ప్రముఖ సినీ విమర్శకుడు భరద్వాజ్ రంగన్ తన సోషల్ మీడియా ఖాతాలో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నివేదికను షేర్ చేస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేశారు. ఇది క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ యొక్క అసలైన విజయం అని కొందరు అంటుంటే, మరికొందరు ఆ వ్యక్తి యొక్క ప్లానింగ్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు.

మరికొన్ని ఆసక్తికర అంశాలు

కేవలం కండోమ్స్ మాత్రమే కాదు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నివేదికలో భారతీయుల షాపింగ్ అలవాట్లకు సంబంధించి మరికొన్ని ఆసక్తికర విషయాలు కూడా వెల్లడయ్యాయి. ప్రెగ్నెన్సీ కిట్స్, ఎమర్జెన్సీ పిల్స్ వంటివి కూడా ఇన్‌స్టామార్ట్ ద్వారా భారీగా అమ్ముడవుతున్నాయి. చిప్స్, కూల్ డ్రింక్స్, బిర్యానీ ఆర్డర్లు ఎప్పటిలాగే టాప్ లిస్టులో ఉన్నాయి. ఒకప్పుడు షాపుకు వెళ్లి అడగడానికి మొహమాటపడే వస్తువులను ఇప్పుడు ప్రైవసీ, వేగవంతమైన డెలివరీ సౌకర్యం ఉండటంతో ప్రజలు ఆన్‌లైన్‌లో భారీగా ఆర్డర్ చేస్తున్నారని చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం.


మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..