
బెంగళూరులోని బసవేశ్వరనగర్ లో కస్టమర్ పై ఓ డెలివరీ బాయ్ దాడికి పాల్పడ్డాడు. డెలివరీ చిరునామా విషయంలో తలెత్తిన వివాదం కాస్తా కొట్టుకునే వరకూ వెళ్లింది. ఈ ఘటనలో కస్టమర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. డెలివరీ బాయ్ దాడి దృశ్యాలు ఇంటి ముందు ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బసవేశ్వరనగర్‌కు చెందిన 30 ఏళ్ల శశాంక్ అనే వ్యాపారవేత్త ఆన్‌లైన్‌లో కొన్ని వస్తువులు ఆర్డర్ చేశారు. వాటిని డెలివరీ చేసేందుకు విష్ణువర్ధన్ అనే ఏజెంట్ వచ్చాడు. ఆర్డర్ తీసుకునేందుకు శశాంక్ వదిన బయటకు వెళ్లగా, డెలివరీ చిరునామా తప్పుగా ఇచ్చారంటూ విష్ణువర్ధన్ ఆమెతో గొడవకు దిగాడు. పెద్దగా కేకలు వేస్తూ దురుసుగా ప్రవర్తించాడు. ఈ గొడవను గమనించిన శశాంక్ అక్కడికి వచ్చి, డెలివరీ ఏజెంట్ ప్రవర్తనను ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన విష్ణువర్ధన్, శశాంక్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో శశాంక్ తలకు తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బసవేశ్వరనగర్ పోలీసులు డెలివరీ ఏజెంట్ విష్ణువర్ధన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సదరు యాజమాన్యానికి కూడా నోటీసులు జారీ చేసి, నిందితుడి వివరాలు, ఆరోపణలపై వివరణ కోరినట్లు పోలీసులు తెలిపారు.
#Bengaluru man Shashank S, has alleged he was assaulted by a #Zepto delivery agent following an address-related dispute. Shashank claims he was punched multiple times, resulting in a skull fracture. FIR filed against the delivery executive
But CCTV footage from the scene appears… pic.twitter.com/bORjmUEZGM
— Nabila Jamal (@nabilajamal_) May 25, 2025