Photo Puzzle: గజిబిజి పజిల్.. ఈ ఫోటోలో సింహాన్ని గుర్తిస్తే.. మీ ఐ పవర్ కిర్రాక్ అంతే

పజిల్స్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం. చాలామందికి ఉంటుంది.. ఎందుకంటే టాస్క్ ఏదైనా కంప్లీట్ చేయాలనే ఆత్మవిశ్వాసంతో చాలామంది ఉంటారు. అలాంటివారి కోసం ఓ పజిల్ తీసుకొచ్చాం.

Photo Puzzle:  గజిబిజి పజిల్.. ఈ ఫోటోలో సింహాన్ని గుర్తిస్తే.. మీ ఐ పవర్ కిర్రాక్ అంతే
Find The Mountain Lion

Updated on: May 09, 2022 | 9:55 PM

ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media) ఏ రేంజ్‌లో మనుషుల్ని ప్రభావితం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెద్దలు, చిన్నలు అని లేదు… అందరూ  సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు పజిల్స్(puzzles) బాగా ట్రెండ్ అవుతున్నాయి. వీటిని సాల్వ్ చేసేందుకు చాలామంది ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. కొంతమంది పజిల్ కనబడితే చాలు.. దాని అంతు చూడకుండా వదిలిపెట్టరు. పజిల్స్ ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాయి. మెదడుకు మేతగా కూడా ఉపయోగపడతాయి. అయితే పజిల్స్ అంటే వీకెండ్ బుక్స్, మ్యాగ్‌జైన్స్‌లో వచ్చేవి మాత్రమే కాదు. ఫోటో పజిల్స్ కూడా ఉంటాయి. ‘ఈ ఫోటోలో జంతువును కనిపెట్టండి’.. ‘ఈ చిత్రంలో ఏయే జంతువులు ఉన్నాయి’ లాంటి ఫోటో పజిల్స్ నెట్టింట బాగా సర్కులేట్ అవుతున్నాయి. వీటిని సాల్వ్ చేయడం మీరనుకున్నంత సులువు కాదు. వీటిని సాల్వ్ చేయాలంటే మీ కనుచూపులో పవర్ ఉండాలి… బుర్రలో పదును ఉండాలి. లేదంటే ఇవి మిమ్మల్ని చాలా కన్‌ఫ్యూజ్ చేస్తాయి.  ఎంతసేపు ట్రై చేసినా సమధానం కనిపించక.. సహనాన్ని పరీక్షిస్తాయి. అయితే సదరు ఫోటోలోని జంతువును లేదా వస్తువును కనిపెడితే.. సూపర్ కిక్ వస్తుంది.

తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ  సర్కులేట్ అవుతోంది. మీరు పైన చూస్తోన్న ఫోటోలో ఓ సింహం దాగుంది. అక్కడి పర్వతాల రంగులో ఉండటం వల్ల దాన్ని కనిపెట్టడం చాలా కష్టం  నూటికి 80 శాతం మంది ఈ పజిల్ సాల్వ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఫోటోలోని సింహాన్ని కొద్ది సమయంలోనే కనిపెట్టారంటే మీరు గ్రేట్ అని ఒప్పుకోవాలి. మీరు ఆ సింహాన్ని కనిపెట్టలేకపోతే సమాధానం కోసం కింద ఫోటోను చూడండి.

Mountain Lion

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us