Viral Photo: ఈ ఫోటోలో పిల్లి దాగుంది.. కనిపెడితే మీరు జీనియస్ అన్నట్లే.!

ట్రెండింగ్ విషయాలకు సోషల్ మీడియాలో నిలయం. ఎన్నో చిత్ర విచిత్రమైన ఫోటోలు, వైరల్ వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి...

Viral Photo: ఈ ఫోటోలో పిల్లి దాగుంది.. కనిపెడితే మీరు జీనియస్ అన్నట్లే.!
Cat

Updated on: Jan 07, 2022 | 10:58 AM

ట్రెండింగ్ విషయాలకు సోషల్ మీడియాలో నిలయం. ఎన్నో చిత్ర విచిత్రమైన ఫోటోలు, వైరల్ వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఇదిలా ఉంటే.. కొన్ని ఫోటోలు మనల్ని ఏమరుపాటుకు గురి చేస్తుంటాయి. అందులో ఏముందో కనిపెట్టేందుకు మనం శతవిధాల ప్రయత్నాలు సాగించాల్సి వస్తుంది. పైకి కనిపించేది ఒకటి.. క్షుణ్ణంగా పరిశీలిస్తే మరొకటి ఉంటుంది. ఇలాంటి ఫోటో పజిల్స్ ఇంటర్నెట్‌లో కోకొల్లలు. తాజాగా ఆ కోవకు చెందిన ఓ పజిల్ ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పైన పేర్కొన్న ఫోటో చూడటానికి ఓ రూమ్ నిండా ఆట వస్తువులు.. మధ్యలో చిన్నారి ఆడుకుంటున్నట్లు మీకు కనిపించవచ్చు. కానీ అక్కడ ఓ పిల్లి దాగుంది. ఎంచక్కా సేద తీరుతోంది. ఈ ఫోటోలో అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. నూటికి 95 శాతం మంది పిల్లిని కనిపెట్టలేకపోయారు. కొందరు అయితే ఒక్క ట్రైలోనే గుర్తించారు. మరి మీరూ తీక్షణంగా చూస్తే పిల్లిని గుర్తించవచ్చు. ఒకవేళ దొరక్కపోతే సమాధానం కోసం మీరు క్రింద ఫోటోను చూడండి.

Loading...
Unable to load recommendations.
Follow Us